బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో ఒక ప్రేమ జంట తప్పనిసరి ఏమో. సీజన్-1 లో ప్రిన్స్ మరియు దీక్షా పంత్ రొమాన్స్ చేయగా... రెండో సీజన్లో సామ్రాట్-తేజస్విని ప్రేమాయణం సాగించారు. కానీ ఈ సీజన్ కి వచ్చేటప్పటికి మాత్రం ఆ డోస్ చాలా పెరిగింది అనే చెప్పాలి. రాహుల్ సిప్లిగంజ్ మరియు పునర్నవి భూపాలం ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలడం బిగ్ బాస్ హౌస్ లో మనందరం చూడొచ్చు. ఇక చుట్టూ ఉన్న మిగతా ఇంటి సభ్యులు ఆహా... ఓహో అంటూ చప్పట్లు కొడుతూ వాళ్ళని మరింత ఎంకరేజ్ చేయడం మామూలే. ఇప్పటివరకు ఒక లెవెల్ లో ఉన్న వారి సాన్నిహిత్యం ఈవారం నామినేషన్ ప్రక్రియ లో హద్దులు దాటేసింది.

మొదట పునర్ణవి ని నామినేషన్ నుండి కాపాడేందుకు రాహుల్ 20 గ్లాసుల కాకరకాయ రసాన్ని వాంతులు చేసుకుంటూ కిందా మీద పడి తాగాడు. అందుకు పునర్నవి అతనికి ఆప్యాయంగా ఒక హగ్ ఇచ్చి మరీ ముద్దు పెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్.... రాహుల్ నామినేషన్ దగ్గర చాలా తెలివిగా వ్యవహరించాడు. రాహుల్ కనుక ఈ వారం నామినేషన్ నుండి సురక్షితడు కావాలంటే పునర్నవి ఈ సీజన్ మొత్తానికి తనను తాను నామినేట్ చేసుకోవాలని ఆంక్ష పెట్టాడు. రాహుల్ ఇదే విషయం పునర్నవితో ప్రస్తావించగా తాను అందుకు సిద్ధం అని అనేసింది. 

కానీ రాహుల్ మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ఈ వారం కాకపోతే వచ్చే వారం అయినా ఇంట్లో నుంచి వెళ్లిపోవచ్చని.... ఇంట్లో తన పోరాటం ఏదో తానే చేసుకుంటానని అన్నాడు. ఈ ఒక్క వారం కోసం పునర్నవి సీజన్ మొత్తం నామినేట్ చేసుకోవడం అన్నది చిన్న విషయం కాదని ఆమెతో వాదించాడు. పునర్నవి మాత్రం తన కోసం నామినేట్ అవ్వడానికి రెడీ అయినా రాహుల్ అక్కర్లేదు అని చెప్పి ఈ వారం నామినేషన్లను నిల్చున్నాడు.

ముందు తన కోసం అంత చేసిన రాహుల్ తర్వాత ఏమీ ఆశించకుండా ఉన్నందుకు ఇంప్రెస్ అయిపోయిన పునర్నవి ఒకవేళ నువ్వు అన్నట్లే ఇంటి నుంచి కనుక నువ్వు వెళ్ళిపోతే తర్వాత నా పరిస్థితి ఏంటి అని బోరున విలపించింది. నువ్వు లేకపోతే ఇంట్లో నేను ఉండలేను అంటూ రాహుల్ ని గట్టిగా హత్తుకుంది. మధ్యలో వచ్చి శ్రీముఖి ఎంతసేపు బూత్ లో ఏం జరిగింది అని అడగగా రాహుల్ నవ్వుతూ చాలా 'కెమిస్ట్రీ' నడిచిందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ మాత్రం చాలదా... బిగ్ బాస్ రేటింగ్స్ ను మరో రెండు వారాల వరకు కాపాడేందుకు.


మరింత సమాచారం తెలుసుకోండి: