యవ్వనం అనేది ఎంతగా దాచిన దాగదంటారు.కాని ఈ విషయం హీరోల జీవితంలో అబద్దం అంటున్నారు.ఇప్పుడొస్తున్న నయా హీరోలకు తామేమి తక్కువ కాదన్నట్లుగా ఇంకా వెండితెరపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్న కొందరు హీరోలు,తమ వయస్సు అస్సలు తరగలేదని నిరూపిస్తున్నారు.వారు తెరపై కనిపిస్తే చాలు అభిమానుల చేతులు చప్పట్లతో,నోరు విజిల్లతో దడదడలాడుతుంది..ఇంకా చెప్పాలంటే ఆ హీరోల స్టైలే వేరు.ఇప్పటికీ ఆ హీరోల సినిమాలు వస్తున్నాయంటే.థియేటర్స్ వద్ద అభిమానుల సందడే వేరు.ఇంతకీ ఎవరా హీరోలు అనుకుంటున్నారా...



ఇంకెవరు గత 40 దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ప్రభంజనాలు సృష్టించి ఇప్పటికి రికార్డ్‌లను బ్రేక్ చేస్తూ ముందుకెళుతున్న మెగాస్టార్ చిరంజీవి,నందమూరి బాలకృష్ణ,కింగ్ నాగార్జున,రాజశేఖర్,వెంకటేష్,కమల్ హాసన్,రజనీకాంత్‌లు.నిజంగా వీరు అప్పుడు ఇప్పుడు సినిమాల్లో హీరోలే కానీ వారితో నటించిన హీరోయిన్లు మాత్రం ఇప్పుడు వచ్చే పలు సినిమాల్లో, బామ్మలు, అమ్మల క్యారెక్టర్లలో నటిస్తున్నారు.అప్పటి హీరోల పక్కన ఆడి పాడిన వారు..ఇప్పటి హీరోలకు అక్కలుగా నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.ఇక వారితో సినిమాలు చేసిన హీరోలు మాత్రం ఇప్పటికింక నా వయస్సు నిండా పదహరే అంటూ యంగ్‌గా ఉండి ప్రేక్షకులను మాత్రం ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నారు.బాలయ్య అలియాస్ నందమూరి బాలకృష్ణ అటు రాజకీయాల్లో ఉంటూ,ఇటు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నారు.



కాగా మెగాస్టార్ చిరంజీవి  2000వ సంవత్సరం నుంచీ టాలీవుడ్‌కి దూరమై రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు.తాజాగా మళ్లీ,‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ‘సైరా నరసింహా రెడ్డి’సినిమా చేశారు.ఇక నాగార్జున,వెంకటేష్‌, రాజశేఖర్‌లు కూడా అప్పటి నుంచి,ఇప్పటివరకూ సినీ కెరీర్‌ను కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అంతే కాకుండా తమిళ,కన్నడ, హిందీతో పాటు పలుభాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలు కమల్ హాసన్,రజనీకాంత్‌లు.వీరికి తెలుగులో కూడా మంచి గుర్తింపు, డిమాండ్ వుంది అందుకు ఇప్పటికీ వీరి సినిమాలు హాలీవుడ్‌ రేంజ్‌లో రిలీజ్ అవ్వడం నిదర్శనం.ఇంకా కొన్ని రోజు లాగితే దాదాపు ఇప్పుడున్న ముద్దుగుమ్మలంతా అమ్మలు, బామ్మలు,అక్కలుగా రావడం చూస్తాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: