ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన  "డ్రీమ్ గర్ల్ " సినిమా గత  శుక్రవారం రిలీజ్ అయిన సంగతీ తెలిసిందే.ఈ సినిమా మంచి టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి కానీ అవి సినిమా పై ఎలాంటి ప్రభావం చూపడం లేదు.ఆయుష్మాన్ ఖురానా  మళ్లీ ఒక వైవిధ్యభరితమైన కథాంశంతో మన ముందుకు వచ్చాడు.

ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా కరమ్ అనే పాత్రలో కనిపిస్తాడు. కరమ్ వీధి నాటకాల్లో ఆడవేషాలు వేస్తాడు. తనకున్న టాలెంట్ తో ఫ్రెండ్ షిప్ కాల్ సెంటర్ లో జాబ్ సంపాదిస్తాడు. అక్కడి నుండి పూజ గా పేరు మార్చుకొని ఆడ గొంతుతో కస్టమర్స్ తో మాట్లాడతాడు. అయితే చివరికి అందరు పూజ ను ప్రేమించడం మొదలుపెడతారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాలి.

డ్రీమ్ గర్ల సినిమా మంచి కామెడీ ఎంటర్టైనర్. ఇందులో వచ్చే కామెడీ సన్నివేశాలను ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయుష్మాన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రీసెంట్ అనౌన్స్ చేసిన జాతీయ అవార్డుల జాబితాలో ఆయుష్మాన్ ఖురానా కు ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు వచ్చింది. డ్రీమ్ గర్ల  మొదటి రోజు 10.5 కోట్లు,రెండవ రోజు 16.42 కోట్లు,మూడవ రోజు 18 కోట్లు. సోమవారం  7 కోట్లు, మంగళవారం 7.40 మొత్తం 59.40 కోట్లు కలెక్ట్.చేసింది. భారీ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తుంది.   .

వార్ మరియు సైరా సినిమాలు అక్టోబర్ 2న వస్తున్నాయి. అప్పటి వరకు.డ్రీమ్ గర్ల కలెక్షన్స్ కు   ఏలాంటి అడ్డంకులు లేవు. "బధాయ్ హో" .సినిమా. 136.88 కోట్లు కలెక్ట్ చేసి ఆయుష్మాన్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది."డ్రీమ్ గర్ల "సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: