నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గ్యాంగ్ లీడర్. శుక్రవారం రోజు విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అబవ్ యావరేజ్ టాక్ వచ్చింది. సినిమా కథ, కథనం కొత్తగా ఉండటం, ప్రధాన పాత్రల్లోని నటులు అందరూ అద్భుతంగా నటించటం సినిమాకు ప్లస్ అయ్యాయి. మొదటి మూడు రోజులు ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వచ్చాయి. 
 
కానీ వీకెండ్ పూర్తయిన తరువాత ఈ సినిమాకు సమస్య మొదలైంది. మూడు రోజుల్లో 50 శాతం రికవరీ చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా కలెక్షన్లు సోమవారం రోజు నుండి తగ్గుముఖం పట్టాయి. మంగళవారం గ్యాంగ్ లీడర్ సినిమా కలెక్షన్లలో భారీగా డ్రాప్ కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఈ సినిమా షేర్ కోటి రుపాయల కంటే తక్కువ అని తెలుస్తోంది. 5 రోజుల్లో గ్యాంగ్ లీడర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 13.60 కోట్ల రుపాయల షేర్ వసూలు చేసింది. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు 21 కోట్ల రుపాయలకు అమ్ముడవగా సినిమా హిట్ అనిపించుకోవాలంటే మరో 8 కోట్ల రుపాయలు వసూలు చేయాల్సి ఉంది. మరోవైపు ఓవర్సీస్ లో కూడా వీకెండ్ తరువాత ఈ సినిమా కలెక్షన్లు భారీగా తగ్గాయి. పుల్ రన్లో గ్యాంగ్ లీడర్ 1 మిలియన్ డాలర్ వసూలు చేస్తుందా అంటే అనుమానమే అని తెలుస్తోంది. నాని నటించిన జెర్సీ సినిమాకు కూడా హిట్ టాక్ వచ్చినా టాక్ కు తగిన కలెక్షన్లు రాలేదు. 
 
మరో రెండు రోజుల్లో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే గ్యాంగ్ లీడర్ సినిమా కలెక్షన్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. పుల్ రన్లో గ్యాంగ్ లీడర్ సినిమా సాధించే కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫైనల్ రేంజ్ ఏంటో చెప్పవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: