ఈఏడాది మచ్ అవైటెడ్ సినిమాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన  సాహో కూడా ఒకటి.   ఇటీవల భారీ అంచనాల మధ్య   విడుదలైన ఈ చిత్రం దారుణమైన టాక్ ను తెచ్చుకుంది.  అయితే వసూళ్ల పరంగా  మాత్రం  ఈఏడాది  అత్యధిక  గ్రాస్ వసూళ్లను రాబట్టిన భారతీయ సినిమా గా సాహో రికార్డు సృష్టించింది.  ఇక  బాక్సాఫీస్ వద్ద  దాదాపుగా ఈ చిత్రం యొక్క  రన్ ముగిసినట్లే.  ఇప్పటివరకు ఈ చిత్రం  అన్ని భాషల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా  402కోట్ల గ్రాస్ వసూళ్లను అలాగే  218కోట్ల షేర్ ను కలెక్ట్ చేసిందని సమాచారం. 



ఒక్క హిందీలోనే ఈచిత్రం 153కోట్ల వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకోగా మిగితా భాషల్లో  డిజాస్టర్  ఫలితాన్ని రాబట్టింది.  అలాగే ఓవర్సీస్ లో కూడా  ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది.  తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 125కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా  కేవలం  80కోట్ల వసూళ్లను మాత్రామే రాబట్టింది.  తమిళనాడు , కేరళ , కర్ణాటక కలుపుకొని 22 కోట్ల షేర్ ను రాబట్టింది.  ఇక ఓవర్సీస్  లో 42కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా  28కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అయితే ఓ కోణంలో  చూస్తే  ఇంత నెగిటివ్ టాక్ లో కూడా   సాహో ఈ రేంజ్ లో వసూళ్లను రాబట్టడం గొప్ప విషయమే. ఒకవేళ సినిమా కు కనుక  హిట్ టాక్ వస్తే   కలెక్షన్ల విషయంలో  బాహుబలి  తరువాతి స్థానంలో  నిలిచేదే.  రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ తెరకెక్కించిన  ఈ చిత్రాన్ని 370కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఇక ఈ రికార్డులను  మెగా స్టార్ చిరంజీవి నటించిన  సైరా  బ్రేక్ చేసి  ఈఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా అవతరిస్తుందో లేదో చూడాలి. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: