విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సరికొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమా టైటిల్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమా హిట్ అనేది విజయ్ దేవరకొండకి అత్యవసరం. అయితే ఈ సినిమా నుండి లీక్ అవుతున్న కొన్ని ఫీలర్స్ మాత్రం ఈ సినిమాపై అంచనాలు బాగా పెంచేస్తున్నాయి. అర్జున్‌ రెడ్డి సినిమాతో ఎంతో పాపులారిటీ పొందిన స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ..'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సినిమా ఫేం కాంత్రి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

 

విజయ్ దేవరకొండ...ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కరలేదు. ఇతనికి యూత్‌లో ఎంత ఫాలోయింగ్ ఉంది అంటే మళ్ళీ కొత్తగా చెప్పనవసరం లేదు. తన సినిమాలతోనే కాకుండా రియలిస్టిక్ యాటిట్యూడ్‌తో యూత్ కు తెగ కనెక్ట్ అయిపోయాడు. అయితే నటనలో అతనికి ఉన్న టాలెంట్ అన్ని వర్గాలకు అతడిని దగ్గర చేసింది. తక్కువ కాలంలోనే ఎంతో పేరు తెచ్చుకున్నాడు విజయ్. అయితే విజయ్‌కి స్టార్ రేంజ్ ఇచ్చింది మాత్రం 'అర్జున్ రెడ్డి సినిమానే'. ఆ సినిమా హిట్ వల్లే 'గీత గోవిందం' కూడా భారీ స్థాయిలో రికార్డు కొట్టేసింది.  కానీ 'డియర్ కామ్రేడ్' ప్లాప్ అనేది విజయ్ మార్కెట్‌ని బాగా దెబ్బ తీసిందనే చెప్పుకోవాలి. అయితే అతని క్రేజ్‌ని కూడా కిందకి దించింది. అందుకే తన తర్వాత రాబోకే సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు విజయ్.

 

ఈ సినిమాలో విజయ్‌ సరసన రాశీఖన్నా, ఇసబెల్లా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా.. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి.. తాజాగా  ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్ర బృందం.


మరింత సమాచారం తెలుసుకోండి: