ఈ మాటలు అంటుంది ఎవరో కాదు మెగాబ్రదర్ నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.  ‘ముకుంద’ సినిమాతో హీరోగా పరిచయం అయిన వరుణ్ తేజ్ తర్వాత నటించిన కంచె సినిమా ఏకంగా జాతీయ అవార్డు పొందింది.  వరుణ్ తేజ్ లుక్ చాలా కూల్ గా ఉంటాడని మొదట్లో టాక్ వినిపించింది..ఈ హీరో లవ్ స్టోరీలకు మాత్రమే పనికి వస్తాడు అంటూ టాలీవుడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్న సమయంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాలో ఊరమాస్ లుక్ తో కనిపించాడు.  దాంతో ఈ మెగా హీరో ఎలాంటి పాత్రలకైనా సిద్దం అన్న సంకేతాలు కూడా ఇచ్చాడు. 

ఇక ఫిదా, తొలిప్రేమ లాంటి సినిమాలో మంచి విజయాలు అందుకున్న వరుణ్ తేజ్ తర్వాత వచ్చిన సినిమాలు కాస్త నిరాశపరిచాయి.  తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ సినిమాలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్.  ఈ మూవీ 1980 కాలం పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందంటున్నారు..ఇక టీజర్, ట్రైలర్  సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  తాజాగా వెల్లువొచ్చె గోదారమ్మ పాటలో వరుణ్ తేజ్-పూజా హెగ్డే కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది..ఈ పాట చూస్తున్నంత సేపు అప్పటి సినీ తారలను చూస్తున్నట్లే ఉంది. తాజాగా  ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ..ఈ సినిమాలో నేను గద్దలకొండ గణేశ్ గా కనిపిస్తాను.నా పాత్రలో విలన్ షేడ్స్ ఉండటంతో, రిస్క్ చేయవద్దని చాలామంది చెప్పారు. 

అయితే రోటీన్ కి భిన్నంగా ఏ పాత్రలో అయినా నటించడం మెగా ఫ్యామిలీకి కొత్తేం కాదు.. నేను కథపై గల నమ్మకంతో రంగంలోకి దిగాను. ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడతాను. ఈ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని చేశాను. తెరపై మీకు గద్దలకొండ గణేశ్ కనిపిస్తాడేగానీ, వరుణ్ తేజ్ మాత్రం కనిపించడు  అని చెప్పుకొచ్చాడు. సినిమా చూస్తే మీ అభిప్రాయాలు పూర్తిగా మారిపోతాయి అని..వాల్మీకి మూవీని మంచి విజయం అందించాలని ప్రేక్షకులను కోరుతున్నట్లు వరుణ్ తేజ్ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: