ప్రభాస్, శ్రధ్ధా కపూర్ జంటగా నటించిన సాహో సినిమా ఆగస్టు నెల 30వ తేదీన విడుదలైంది. దాదాపు 300 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సాహో సినిమాకు రిలీజ్ రోజు క్రిటిక్స్ నుండి, ప్రేక్షకుల నుండి నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ టాక్ వచ్చాయి. యువి క్రియేషన్స్ ఈ సినిమాను దాదాపు 350 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. తెలుగులో మొదటి వీకెండ్ వరకు ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చినా ఆ తరువాత కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. 
 
తెలుగులో 125 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సాహో సినిమాకు పుల్ రన్లో 85 కోట్ల రుపాయల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. సాహో సినిమాను తెలుగులో కొన్న డిస్ట్రిబ్యూటర్లకు 40 కోట్ల రుపాయలు నష్టాలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో తెలుగులో ఇంత భారీగా నష్టాలను మిగిల్చిన సినిమా సాహో మాత్రమే. బాలీవుడ్ లో మాత్రం సాహో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మూడు వారాల్లో ఈ సినిమాకు 153 కోట్ల రుపాయల షేర్ కలెక్షన్లు బాలీవుడ్ లో వచ్చాయి. 
 
బాహుబలి, బాహుబలి 2 సినిమాల వలన ప్రభాస్ కు బాలీవుడ్లో వచ్చిన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని సాహో సినిమాతో ప్రూవ్ అయింది. నెగిటివ్ టాక్ వచ్చిన సాహో సినిమాకే బాలీవుడ్లో రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయంటే ప్రభాస్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే హిందీలో 200 కోట్ల రుపాయల షేర్ కలెక్షన్లు సులభంగా వస్తాయనటంలో సందేహం లేదు. ఓవర్సీస్ లో కూడా సాహో సినిమాకు నష్టాలు తప్పలేదు. 
 
తమిళంలో, మలయాళంలో కూడా సాహో సినిమాకు భారీగా నష్టాలు వచ్చాయి. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు హిందీ మినహా మిగతా భాషల్లో 70 కోట్ల రుపాయల నష్టం వచ్చిందని తెలుస్తోంది. ప్రభాస్ తరువాత సినిమా జాన్ కూడా యువి క్రియేషన్స్ బ్యానర్లోనే తెరకెక్కుతూ ఉండటంతో జాన్ సినిమా థియేట్రికల్ రైట్స్ నష్టాలను భర్తీ చేసి సాహో డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: