Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 2:10 am IST

Menu &Sections

Search

బన్నీకి  జోడిగా పల్లెటూరి పిల్ల !

బన్నీకి  జోడిగా పల్లెటూరి పిల్ల !
బన్నీకి  జోడిగా పల్లెటూరి పిల్ల !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తరువాత సినిమాని  అల్లు అర్జున్ తో  చేయబోతున్న విషయం తెలిసిందే.  అయితే ముందుగా సుకుమార్ బన్నకి ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథను చెప్పాడు. ఈ కథకే బన్నీ  ముందు ఓకే చెప్పిన... తరువాత  వేరే కథ చేస్తే బాగుంటుందని ముఖ్యంగా   లవ్ స్టోరీ చేద్దామని సుకుమార్‌ తో అన్నారట. దీంతో సుకుమార్  ఓ లవ్ స్టోరీని రాసినట్లు తెలుస్తోంది.   అయితే సుకుమార్ రాసిన లవ్ స్టోరీకి సంబంధించిన ఫుల్  స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందట.  కాగా స్క్రిప్ట్ లో హీరోయిన్ పాత్ర చాల బాగా వచ్చిందని తెలుస్తోంది. స్వతహాగా  సుకుమార్ తన ప్రతి సినిమాలోనూ కథానాయికలకు మంచి ప్రాథాన్యం ఇస్తూ.. వారి కోసం మంచి పాత్రలు రాస్తుంటారు. ముఖ్యంగా  అన్ని విధాల వారి పాత్రలను కథలో ఇన్వాల్వ్ చేస్తుంటారు.  కాగా అల్లు అర్జున్ తో  చేస్తోన్న  సినిమాలో కూడా   హీరోయిన్ పాత్రను చాల బలంగా రాసుకున్నారట.  అది కూడా పల్లెటూరి యువతి పాత్రట.  ఇక ఈ పాత్రలో నటించనుంది రష్మిక మండన్నా.  రష్మిక  ఇప్పటివరకు చేసిన మూడు చిత్రాల్లోనూ మంచి పాత్రలే దక్కించుకుంది.  


ఇక బన్నీ మొత్తానికి  స్పీడ్ పెంచేశాడు. ఈ ఏడాది మూడు సినిమాలను వరుసగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్  త్రివిక్రమ్ - అల్లు  అర్జున్ కాంబినేషన్ లో వస్తోన్న  'అల వైకుంఠపురములో'  సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు బన్నీ.   ఒక పక్క  త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే  సుకుమార్  దర్శకత్వంలో సినిమా చెయ్యడానికి అంగీకరించాడు.  అక్టోబర్ నుండి ఈ  సినిమాను మొదలుపెట్టనున్నాడు.  నిజానికి సుకుమార్ తో సినిమాని  సెట్స్ పైకి  తీసుకెళ్ళటానికీ చాలా కాలం ఎదురుచూసిన అల్లు అర్జున్.. సుకుమార్ కోసం బల్క్ డేట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడట.  పైగా ఈ  ఏడాది మొత్తం మూడు సినిమాలతో బిజీ బిజీగా గడపనున్నాడు.  మొదటగా విడుదలై  త్రివిక్రమ్ సినిమాలో  కాస్త వైవిధ్యంగా  బన్నీ కనిపించనున్నాడట.  బన్నీ డ్రెసింగ్ స్టైల్ దగ్గర నుంచి  హెయిర్ స్టైల్ వరకూ ఈ సినిమాలో కొత్త అల్లు అర్జున్ ని చూస్తామని తెలుస్తోంది.  'సన్నాఫ్ సత్యమూర్తి’లో కూడా  బన్నీ మాడ్యులేషన్ని కాస్త కొత్తగా మార్చాడు త్రివిక్రమ్. అలాగే ఈ సినిమాలోనూ కొత్త బన్నీని చూపిస్తాడట. కాగా ఈ సినిమా కోసం తమన్  ఇప్పటికే ట్యూన్స్ అన్ని ఇచ్చేశాడు.  బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా సినిమాలో  ఓ మాస్ సాంగ్ ఉండబోతుందని  తెలుస్తోంది.  త్రివిక్రమ్ సినిమా అవుట్ ఫుట్ చాల బాగా వస్తోందని, గ్యారింటీగా ఈ సినిమా హిట్ అవ్వబోతుందని చిత్రబృందం చెబుతుంది.       


Rashmika Mandanna powerful village girl in Allu Arjun and Sukumar's movie  
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్చ్.. ఆ కీలక నేత కూడా టీడీపీ నుండి ?
ఈ సినిమాతోనైనా హిట్ ట్రాక్ ఎక్కుతాడా ?
టాలీవుడ్ కి నేషనల్ రేంజ్ లో ప్రశంసలు !
ప్లేస్ మారిన  పవన్  స్పీచ్ మారదు !
'అల వైకుంఠపురములో'..  ఆరు యాక్షన్ సీక్వెన్స్ స్  !
స్పీడ్ పెంచాడు  మరి సక్సెస్ వస్తోందా ?
కొరటాల సినిమాలో హైలెట్స్ అవేనా ?
అతనిలా ఎందుకు చేయలేకపోతున్నామో !
హాట్ బ్యూటీకి సాఫ్ట్ యాక్టర్ సూట్ అవుతారా  ?
'ఫైటర్' కోసం షూట్  ప్లాన్ చేస్తోన్న పూరి !
ప్చ్  'అర్జున్ సురవరం' పరిస్థితి ఏమిటో ?
నవంబర్ రెండో వారం నుండి కంగ‌నా ర‌నౌత్ !
'రొమాంటిక్' హీరోకి తల్లిగా  !
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.