Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 5:36 pm IST

Menu &Sections

Search

‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!

‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' నిర్మితమైంది. దేశభక్తికి సంబంధించిన ఈ చారిత్రక సినిమాని గాంధీ జయంతి  సందర్భాన్ని పురస్కరించుకుని, అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. చాలాగ్యాప్ తరువాత చిరంజీవి నటిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. 

అమిత్ త్రివేది నేపధ్య సంగీతానికి రత్నవేలు విజువల్స్ కు మెగాస్టార్ నటనకు ఈ ట్రైలర్ అర్ధం పట్టింది. ‘సైరా’ ట్రైలర్ చుస్తే గూస్ బంప్స్ వచ్చాయి. అమితాబ్, నయనతార, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్ చెప్పిన డైలాగ్స్ కూడా ఈ ట్రైలర్ లో ఉండటం విశేషం. ట్రైలర్ చివర్లో ఝాన్సీ లక్ష్మీ బాయిగా అనుష్క పాత్ర పరిచయం.. అండర్ వాటర్ ఫైట్ కి సంబంధించిన షాట్స్ ఉన్నాయి. సోషల్ మీడియాతో బాటుగా ఈ సినిమా ట్రైలర్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ లో వేస్తున్న సంగతి తెలిసిందే.

వాస్తవానికి సెప్టెంబర్ 18, ఈ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగాల్సి ఉన్నా..వాతావరణ శాఖ సూచన మేరకు హైదరాబాద్ లో భారీ వర్షలు పడబోతున్నాయని అందుకే  22న హైదరాబాద్ లోని ఎల్.బి స్టేడియంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరపనున్నారు. ఈ వేడుక తరువాత 25న చెన్నైలో 27 బెంగళూరులో 29న కేరళలో 30న ముంబైలో ఈ సినిమా వేడుకను చిత్ర యూనిట్ జరపనున్నారని సమాచారం.బాలీవుడ్ లో అక్టోబర్ 2న బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్,టైగర్ ష్రాఫ్ నటించిన ‘వార్’ మూవీ రిలీజ్ అవుతుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.  ఈ మూవీ యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది..ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలు పెంచేసింది.

ఇక సైరా వర్సెస్ వార్ బాలీవుడ్ లో ఏ మూవీ సెన్సేషన్ సృష్టిందో చూడాల్సి ఉంది. తాజాగా సైరా మూవీ కోసం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఈ మూవీ ప్రమోషన్ వర్క్ లో సల్మాన్ ఖాన్ తన తడాఖా చూపిస్తాడట..దీనికి కారణం ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీతో సల్మాన్ కి ఎంతో అనుబంధం ఉంది. మరోవైపు బిగ్ బి అమితాబ్ కూడా ఇందులో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. సో బిగ్ బి క్రేజ్ న్యాచురల్ గా కలిసొచ్చే అంశమే. మొత్తానికి ‘సైరా’కి అన్నీ కలిసి వచ్చి బాలీవుడ్ లో హిట్ కొడితే మెగాస్టార్ కి ఎదురే ఉండదని అంటున్నారు మెగా ఫ్యాన్స్. 


saira narasimha reddy movie;salman khan;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను