ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో చెప్పుకోదగిన సూపర్ హిట్ సినిమా అంటే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రాం, నిధీ అగర్వాల్, నభా నటేష్ నటించిన ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో హిట్ అందుకోవడానికి ఏ సినిమా.. కనీసం ఇస్మార్ట్ కి  దరి దాపుల్లోకి కూడా రాలేక పోయింది. అందుకే ఇప్పుడు అందరు వాల్మీకి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ మాంచి కిక్ ఇచ్చే విధంగా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ పాత్ర సరికొత్తగా ఉండనుంది. ఈ సినిమా తమిళ జిగార్తాండ కు రీమేక్ అని అందరికి తెలిసిన విషయమే. ఇందులో వరుణ్ తేజ్ రెండు షేడ్స్ తో కనిపించనున్నాడు. తమిళ్‌లో సిద్దార్థ చేసిన పాత్రలో తమిళ హీరో అథర్వ చేయనున్నాడు.

ఇక ఈ సినిమా మెయిన్‌గా స్టోరీ మొత్తం అధర్వ-మృణాళిని మధ్యే జరగనుంది. కాకపోతే వీరిద్దరూ తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేరు. మరి వీరి పాత్రలని హరీష్ ఎలా హేండిల్ చేసాడు..? అనేది సినిమా రిలీజ్ అయ్యాక తెరమీదే చూడాలి. దానికి తోడు పూజా ఇందులో ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించదట. కేవలం ఆమెది క్యామియో లాంటి పాత్రేనని హరీష్ చెప్పడం తన ఫ్యాన్స్ ని బాగా నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో బరువు మొత్తం వరుణ్ తేజ్ మీద పడిందని క్లియర్ గా తెలుస్తోంది.

మరి వరుణ్ తేజ్ పాత్రకు ఎంత మంది కనెక్ట్ అవుతారో చూడాలి. ఇప్పటివరకు వరుణ్ సాఫ్ట్ రోల్స్ చేసుకుంటూ వచ్చాడు. సడన్ గా విలన్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. మరి ప్రేక్షకులు యాక్సెఫ్ట్ చేస్తారా? లేదా? చూడాలి. భారీ అంచనాలతో ఈనెల 20న రిలీజ్ అవుతున్న ఈసినిమా రిజల్ట్ ఎలా ఉంటుందోనని చాలా మంది ఆతృతగా మాట్లాడుకుంటున్నారు. ఎఫ్ 2 తో మంచి కమర్షియల్ సక్సస్ అందుకున్న ఈ మెగా హీరో వాల్మీకి గనక అందరు అనుకున్నట్లు బ్లాక్ బస్టర్ అయితే కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో వెల్లడం ఖాయం.   


మరింత సమాచారం తెలుసుకోండి: