మంచు మనోజ్ సరసన శ్రీ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా, ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కొంత నిరాశ చెందింది. అయితే ఆ తరువాత కొద్దిరోజులకు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ మూవీ తమన్నాకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇక అక్కడినుండి ఆమెకు పెద్ద సినిమా ఆఫర్లు మెల్లగా పెరిగాయి. అయితే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగిన తమన్నా, కెరీర్ పరంగా కొన్ని హిట్స్ తో పాటు ఫ్లాప్స్ కూడా చవిచూశారు. 

అయితే ఇటీవల తమన్నాకు తెలుగులో ఒక్క ఎఫ్2 సినిమా తప్పించి వేరొక సక్సెస్ అయిన సినిమా లేదనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆమె తెలుగులో మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ సినిమాలో లక్ష్మి అనే పాత్రలో నటిస్తున్న తమన్నా, తన పాత్ర కోసం స్వయంగా తానే డబ్బింగ్ చెప్పుకుందట. ఇక సినిమాలో తమన్నా పాత్ర కాస్త చిన్నదే అయినప్పటికీ సినిమాకు ఎంతో కీలకమని సమాచారం. ఇదివరకు బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో మెరిసిన తమన్నా, ఆ సినిమాలో కూడా చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ మంచి పేరు సంపాదించింది. 

ఇక ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఈ లక్ష్మి అనే క్యారెక్టర్ తప్పకుండా ఆమెకు కెరీర్ పరంగా మంచి గుర్తింపుని ఇవ్వడం ఖాయమని అంటున్నారు. చాలారోజుల నుండి మెగాస్టార్ సినిమాలో నటించాలని భావిస్తున్న తమన్నా, ఈ సినిమా ద్వారా ఆ కల నెరవడం నిజంగా అదృష్టంగా భావిస్తోందట. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ లు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ సంపాదించడంతో, రేపు రిలీజ్ కాబోయే సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాదిస్తుందని తమన్నా సహా సైరా యూనిట్ మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తోందట. మరి వారి ఆశలు ఎంతవరకు నెరవేరతాయో తెలియాలంటే మాత్రం అక్టోబర్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: