ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న పూరి మళ్లీ పూర్తిగా ఫాంలోకి వచ్చేసినట్టే అంటున్నారు. రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మూడు నాలుగేళ్ల పూరి కలను నిజం చేసింది. ఇక పూరి సినిమా హిట్టు కొడితే ఎలా ఉంటుందో మరోసారి ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రూవ్ చేసింది. అందుకే రీసెంట్ గా పూరి అండ్ ఛార్మి ఇద్దరు రెండు కొత్త కార్లు కొన్నారు.   


ఇస్మార్ట్ హిట్ తర్వాత ఏమాత్రం లేటు లేకుండా పూరి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేశాడు. ఫైటర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలాఉంటే విజయ్ సినిమా తర్వాత పూరి మళ్లీ నందమూరి నట సింహం బాలకృష్ణతో సినిమా చేస్తాడని అంటున్నారు.


ఆల్రెడీ బాలయ్యకు కథ చెప్పడం ఆయన ఓకే చెప్పడం జరిగిందట. ప్రస్తుతం బాలకృష్ణ కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తాడట బాలకృష్ణ. బోయపాటితో సింహా, లెజెండ్ సినిమాలు చేసిన బాలయ్య బాబు హ్యాట్రిక్ కాంబోగా ఈ సినిమా చేస్తున్నాడు.  


ఈ సినిమాను మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బోయపాటి సినిమా తర్వాత బాలకృష్ణ పూరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందట. పూరితో బాలయ్య బాబు పైసా వసూల్ సినిమా చేశారు. ఆ సినిమా పెద్దగా ఆడకున్నా పూరి వర్కింగ్ స్టైల్ కు బాలకృష్ణ ఫిదా అయ్యారట. అందుకే లేటెస్ట్ గా పూరి చెప్పిన కథకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. మరి అసలే ఇస్మార్ట్ హిట్ లో ఉన్న పూరి ఈసారి బాలయ్యతో ఎలాంటి సినిమా చేస్తాడో అని నందమూరి ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు.       



మరింత సమాచారం తెలుసుకోండి: