మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ దాదాపు 270 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా సైరా. చిరు 151 వ సినిమా ప్రేక్షకులముందుకు వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, నిహారిక వంటి భారీ తారగణం తో రూపొందించారు. ఇక ఈ సినిమా అతి త్వరలో ప్రపంచ స్థాయిలో భారీగా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో  మెగాస్టార్ మెగా మూవీ సైరా సినిమా ట్రైలర్ విడుదలయింది. మెగా సందోహం మధ్య రాష్ట్రవ్యాప్తంగా ఈ ట్రైలర్ విడుదలయింది. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్ కట్ అద్భుతంగా ఉండటం విశేషం. రెండు మూడు విజువల్స్ చూపించి, ఆతర్వాత ట్రైలర్ మొదలు పెట్టి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచారు చిత్ర బృందం.

ట్రైలర్ మొత్తం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట జీవితాన్ని చూపించి ప్రేక్షకుల్లో ఒక రేంజ్ లో క్రేజ్ ని పెంచారు. ఒక్క సన్నివేశం మినహా మిగిలినదంతా నరసింహారెడ్డి పోరాటం సాగిన విధాన్ని చూపించడంతో ఒక్కసారిగా ప్రేక్షకుల్లో ఆతృత పెరిగింది. ట్రైలర్ ప్రారంభం నుంచి మెల్లగా నరసింహారెడ్డిని ఎలివేట్ చేస్తూ వెళ్లి, ఆపై పోరాటం సాగిన విధానాన్ని, బ్రిటిష్ వాళ్ళ దురాగతాలను చూపించారు. 

ట్రైలర్ లో విజువల్స్ అన్నీ భారీగా వున్నాయి. యుద్ధ సన్నివేశాలు, పోరాటాలు, మిగిలిన విజువల్స్ అన్నీ సినిమాకు పెట్టిన ఖర్చును చూపించాయి. ట్రైలర్ కు వేసిన ఆర్ ఆర్ గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. మొత్తం మీద సైరా సినిమాకు మంచి క్రేజ్ పెంచే విధంగానే కట్ చేసారు. థియోట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే సాహో తో పోల్చుకొని మెగా ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. ఇక మెగాస్టార్ ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 152 వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తున్న కొరటాల చిరు కోసం ఒక అద్భుతమైన కథను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే చిరు కొత్త మేకోవర్ ట్రై చేశారు. ఆ లుక్స్ మెగా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: