ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ లో వచ్చిన రెండు సీజన్లు మంచి సక్సెస్ కాగా, ప్రస్తుతం కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న మూడవ సీజన్ కూడా మంచి జోష్ తో కొనసాగుతోంది. మొదటి సీజన్ కు హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ కు హోస్ట్ గా నాచురల్ స్టార్ నానిలు వ్యవహరించి షోకు మంచి క్రేజ్ మరియు రేటింగ్స్ తెచ్చిపెట్టడం జరిగింది. అయితే ఆపరంగా చూస్తే మాత్రం ఈ ప్రస్తుత మూడవ సీజన్ కు ఒకింత తక్కువగానే ఆదరణ లభిస్తున్నట్లు లేటెస్ట్ గణాంకాలు చెప్తున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. ఈ సీజన్ ప్రారంభం సమయంలో ఎంతో హుషారుగా సాగిన షో, ఆ తరువాత కొన్ని కేసుల్లో ఇరుక్కోవడం, అనంతరం హోస్ట్ గా వ్యవహార్తిస్తున్న నాగార్జున నటించిన మన్మధుడు 2 సినిమా కూడా ఫ్లాప్ కావడంతో నాగ్ కూడా షోపై సరిగా ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నట్లు సమాచారం. 

అయితే హోస్ట్ గా నాగార్జున మాత్రం ఆకట్టుకునే విధంగా పెర్ఫర్మ్ చేస్తున్నప్పటికీ రేటింగ్స్ మాత్రం కొంత తగ్గుతున్నాయట. ఇక షోలోని కొందరు పార్టిసిపెంట్స్ బిహేవియర్ కూడా సరిగా లేదని, షో మొత్తం కేవలం ఒకరిపై మరొకరు నిందించుకోవడం తోనే సాగుతోదనే విమర్శలు కూడా కొద్దిరోజులుగా వినపడుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం బాగానే సాగుతున్న ఈ షో యొక్క రాబోయే నాలుగవ సీజన్ కు సూపర్ స్టార్ మహేష్ ను హోస్ట్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉందట బిగ్ బాగ్ యాజమాన్యం. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులు ఇద్దరూ ఒకరకంగా ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ స్థానికి ముందు వరుసలో ఉంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. 

అయితే పవన్ ఇకపై పూర్తిగా తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేయడంతొ ఇప్పుడు అందరి దృష్టి సూపర్ స్టార్ మీదనే పడింది. కావున ఆయన కనుక తమ రాబోయే సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తే, షోకు మరింతగా క్రేజ్ రావడంతో పాటు మంచి రేటింగ్స్ కూడా దక్కుతాయని భావిస్తోందట బిగ్ బాస్ యాజమాన్యం. అయితే ఇది ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్త మాత్రమే కావడంతో, అసలు ఒకవేళ ఇటువంటి ప్రపోజల్ తన వద్దకు వస్తే మన సూపర్ స్టార్ ఎలా స్పందిస్తారు అనేది మాత్రం చెప్పలేమని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఎక్కువగా ఇటువంటి షోలపై ఆసక్తి చూపని సూపర్ స్టార్, బిగ్ బాస్ కు హోస్ట్ గా వచ్చే అవకాశాలు తక్కువని వారంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ విషయమై ఏమి జరుగుతుందనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: