తెలుగు గడ్డకు చెందిన వీర విప్లవకారుడు “ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి”  జీవితం ఆధారంగా  మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం  అక్టోబరు 2న  గాంధీ జయంతి సందర్భంగా  విడుదల కానుంది.  అయితే ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి కుటుంబ స‌భ్యులు ఇటీవ‌ల రామ్ చరణ్  ఆఫీస్ ముందు ఆందోళ‌న చేసిన సంగతి తెలిసిందే.  త‌మ‌కు న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చిన నిర్మాణ సంస్థ ఇప్పుడు హామీను నేర్చ‌వేర్చాలేదంటూ నిర‌స‌న‌ను తెలియ‌జేశారు  ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి  కుటుంబ స‌భ్యులు.   అయితే తాజాగా  రామ్‌ చ‌ర‌ణ్‌  ఈ విషయం పై మాట్లాడుతూ..  100 ఏళ్ల త‌ర్వాత ఓ వ్య‌క్తి జీవితం చ‌రిత్ర క్రింద‌కు వెళ్లిపోతుంది.  సుప్రీమ్ కోర్టు ఆదేశాల‌నుసారం  దాన్ని సినిమాగా తీసుకోవచ్చు. ఎలాంటి స‌మ‌స్య‌లుండ‌వు. అయినా  న‌ర‌సింహారెడ్డిలాంటి వ్య‌క్తిని ఓ కుటుంబానికి ప‌రిమితం చేయడం నాకు ఇష్టం లేదు.   ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగారు దేశం కో్సం పోరాడారు. ఆయ‌న ఉయ్యాల‌వాడ అనే ప్రాంతం కోసం పోరాడారు. ఆ ఊరు కోస‌మో, జ‌నాల కోస‌మో చేస్తాను. న‌లుగురు వ్య‌క్తుల‌కో, ఓ కుటుంబానికో స‌పోర్ట్ చేయ‌ను. అలా చేసి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగారి స్థాయిని నేను త‌గ్గించ‌ను అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా  ఈ చిత్రం  ట్రైలర్ విడుదల అయి  అంచనాలకి తగ్గట్లుగానే  బాగా ఆకట్టుకుంది.  ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన స్క్రీన్ ప్రేజన్సీతో  ట్రైలర్ లో హైలెట్ గా నిలిచారు. 


అలాగే డైలాగ్ లతో పాటు  నటీనటులు గెటప్స్  వారి పాత్రల తాలూకు ఎలివేషన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ స్ చాల బాగున్నాయి. మొత్తానికి  ప్రతి ఫ్రేమ్ అలరించేవిధంగా సాగింది.  ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.  కాగా  తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం  ప్రముఖ టీవీ ఛానల్,  జీ టీవీ ఈ చిత్రం యొక్క  శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ ను  125 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.   ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక కోసం చిత్రబృందం ఇప్పటికే ఏర్పాట్లు కూడా  చేస్తున్నారు.  ఈ నెల 22న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను ఘనంగా జరపనున్నారు.  ఇక 5 భాషల్లో భారీ ఎత్తున విడుదలవుతున్న ఈ చిత్రం యొక్క హక్కులకు అన్ని భాషల్లోనూ డిమాండ్ అధికంగానే ఉంది.  దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనే పలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు మెగాస్టార్.  పైగా ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌,  సినిమా పై అమాంతం అంచనాలను పెంచేసింది.  ఇక నిర్మాత రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటిస్తున్నారు.  అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: