రానా కెరీర్ లో అతనికి మంచిపేరు తెచ్చిన సినిమాల్లో ఒకరాజు.. ఒక మంత్రి ఒకటి.. ఈ సినిమా అటు రానాకు.. దర్శకుడు తేజాకు.. హీరోయిన్ కాజల్ కు.. అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ తేజా ఈ సినిమాతో మళ్లీ చాలా కాలం తర్వాత హిట్ కొట్టాడు. హీరో రానా కూడా పొలిటికల్ లీడర్ గా చక్కటి నటన కనబరిచాడు.


ఇక కాజల్ కు అయితే ఈ సినిమా చాలా మంచి పేరు తెచ్చింది. హీరోయిన్ అంటే నాలుగు పాటలు.. రెండు ముద్దు సీన్లు అనే ఫార్ములాలా కాకుండా చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. అయితే ఇప్పుడు ఇదే జంట మరోసారి రిపీట్ కాబోతోందట. రానాతో హీరోయిన్ కాజల్ మళ్లీ జట్టుకట్టబోతోందట.


నేనే రాజు నేనే మంత్రిలో రానాతో కాజల్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలాంటి కాజల్ మరోసారి రానా జోడీగా కనిపించనుందనే టాక్ బాగా వినిపిస్తోంది. డైరెక్టర్ నందిని రెడ్డీ వీరిద్దరు జోడీగా సినిమాకు ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీమాఫియా నేపథ్యంలో సాగుతుందట. విలక్షణ దర్శకురాలిగా పేరున్న నందిని రె‌డ్డి.. ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావిస్తున్నారట.


ఆ మధ్య రానా ఓ కొరియన్ మూవీ చూశాడట. చూసీ చూడంగానే స్టోరీ బాగా నచ్చేసిందట. వెంటనే ఆ కొరియన్ మూవీ రీమేక్ హక్కులు కొనేశాడట. ఇప్పుడు అదే మూవీని నందిని రెడ్డి చేతిలో పెట్టి.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు బ్రహ్మాండంగా సినిమా తీయాలని కోరాడట. ఆ కొరియన్ మూవీ చూశాక.. నందినిరెడ్డి కూడా ఓకే చెప్పేసిదంట.


సో.. ఆమె ఇప్పుడు రానా, కాజల్ జోడీతో ఈ మూవీకి రెడీ అవుతున్నారట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఈ మూవీలో కాజలన్ నందినిరెడ్డి ఫస్ట్ ఆప్షన్ కాదట. ఈ సినిమా కోసం మొదట నందినిరెడ్డి కీర్తి సురేశ్ ను సంప్రదించిందట. కానీ ప్రస్తుతం ఆమె ఫుల్ బిజీగా ఉండటంతో డేట్స్ దొరకలేదట. సో.. ఈ సినిమాలో కాజల్ ఫైనల్ అయినట్టేనంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: