క్వీన్ కంగన రనౌత్ స్పీడ్ ఎప్పుడు కూడా బాలీవుడ్ హీరోస్ ని మించే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఒకేసారి రెండు భారీ సినిమాలలో నటించడానికి కంగన సన్నాహాల్లో ఉంది. ముందుగాగా అమ్మ జయలలిత బయోపిక్ ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఏ.ఎల్. విజయ్ దర్శకుడిగా విష్ణు ఇందూరి- శైలేష్ ఆర్.సింగ్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. దీపావళి తర్వాత మైసూర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈలోగానే కంగన తన శరీరభాషను మార్చుకునే ప్రయత్నాల్లో ఉంది. అలాగే జయలలిత పాత్రకు లుక్ ఎలా ఉండాలి? అన్నదానిపై తీవ్రంగానే కసరత్తు కూడా చేస్తోంది. 

ఇందుకోసం ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజెల్స్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ ప్రముఖ హాలీవుడ్ మేకప్ మేన్ జాసన్ కొలిన్స్ సారథ్యంలో రకరకాల లుక్ టెస్టుల్లో పాల్గొననుంది. జయలలిత యుక్తవయసులో గెటప్ .. కథానాయిక అయ్యాక గెటప్.. రాజకీయ నాయకురాలిగా మారాక గెటప్.. ఇలా రకరకాల దశల్లో.. గెటప్స్ మీద మేకోవర్ టెస్ట్ జరగనుందట. కొలిన్స్ ఇదివరకూ కెప్టెన్ మార్వల్- బ్లేడ్ రన్నర్ 2049 సినిమాలకు మేకప్ ని అందించారు.

తెలుగు- తమిళం- హిందీలో ఈ సినిమా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్నారు. తమిళ వెర్షన్ కి 'తలైవి' అని తెలుగు వెర్షన్ కి 'జయ' అని టైటిల్స్ ని ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా రెట్రో స్టయిల్ పాటను చిత్రీకరించనున్నారని.. దీని కోసం కంగన భరతనాట్యం కూడా నేర్చుకుంటుందని తాజా సమాచారం. ఈ సినిమాతో పాటుగా పంగా- ధాకడ్ అనే రెండు సినిమాల్లోనూ కంగన నటిస్తోంది. ధాకడ్ భారీ యాక్షన్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కించే సినిమా. ఈ సినిమా 2020 జనవరిలో ప్రారంభం కానుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: