మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక వెబ్ సీరీస్ లతో ఆడియెన్స్ కు దగ్గరై ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు సినిమాతో వెండితెరకు పరిచయమైన నిహారిక ఆ సినిమాతో పాటుగా ఆ తర్వాత చేసిన హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు కూడా ఫెయిల్యూర్ అవడంతో తన సోలో ప్రయత్నాలను హోల్డ్ లో పెట్టింది.      


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమాలో స్పెషల్ రోల్ చేసింది నిహారిక. అయితే తనకు సిల్వర్ స్క్రీన్ కన్నా వెబ్ సీరీస్ లే కలిసి వచ్చాయని తెలుసుకున్న అమ్మడు మళ్లీ ఓ వెబ్ సీరీస్ కు సిద్ధమైంది. మ్యాడ్ హౌజ్ అంటూ ఓ క్రేజీ వెబ్ సీరీస్ తో రాబోతుంది నిహారిక.


ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అవగా అప్పటి నుండి నిహారిక వెబ్ సీరీస్ అంటే ఆడియెన్స్ లో ఎక్సైటింగ్ ఏర్పడింది. ఇక ఈ మ్యాడ్ హౌజ్ కూడా ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడం పక్కా అంటున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ 100 ఎపిసోడ్స్ తో వస్తుంది.  


మహేష్ ఉప్పాల డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సీరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. కంప్లీట్ ఎంటర్టైనర్ గా రాబోయే ఈ మ్యాడ్ హౌజ్ వెబ్ సీరీస్ పై నిహారిక ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉంది. ఈ వెబ్ సీరీస్ సక్సెస్ అయితే కనుక ఇక నిహారిక సినిమాలను ఆపేసి వెబ్ సీరీస్ లను చేసుకోవడమే బెటర్ అని ఫిక్స్ అవుతుందని అనంటున్నారు. మరి మొదటిసారిగా 100 ఎపిసోడ్స్ ఉన్న వెబ్ సీరీస్ తో వస్తున్న నిహారిక మ్యాడ్ హౌజ్ తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ప్రయత్నం మంచిది అయితే దానికి తగిన ఫలితం వస్తుందన్నట్టుగా వెబ్ సీరీస్ తో నిహారిక సక్సెస్ అయ్యేలా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: