ఎట్టకేలకు మెగా అభిమానులకు చిరంజీవి సినిమా ‘సైరా’ ట్రైలర్ రిలీజ్ కావడంతో సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ చూసి చాలామంది అంచనాల బీభత్సంగా పెట్టుకోవడం జరిగింది. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమా లో ఉయ్యాలవాడ పాత్రలో చిరంజీవి నటించడంతో సినిమాపై బీభత్సమైన క్రేజ్..మరింత పెరిగింది. ఈ క్రమంలో ఉయ్యాలవాడ పాత్రలో చిరంజీవి ఏ విధంగా నటించారు అన్నది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.


అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ఈ సినిమా సౌత్ మరియు హిందీ లో కూడా రిలీజ్ అవుతుంది. ఇటువంటి నేపథ్యంలో సినిమా కొన్ని రోజులలో విడుదల కాబోతున్న క్రమం ఉయ్యాలవాడ కుటుంబీకులు అని రామ్ చరణ్ పై మరియు సినిమా యూనిట్ లేనిపోని విమర్శలు చేసే చిరంజీవి ఆఫీస్ ముందు ఇటీవల ఆందోళనకు దిగడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో సైరా సినిమా పై కాంట్రవర్సీ కామెంట్లు రావడం జరిగాయి’ దీంతో ప్రొడ్యూసర్ రాంచరణ్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు.


సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఒక వ్యక్తి మరణించి 100 ఏళ్ళు గడచిన తర్వాత ఆయన జీవితం చరిత్ర అవుతుంది. దానిని సినిమాగా తీయాలంటే గౌరవంగా వ్యవహరించాలి. మంగళ్ పాండే జీవిత చరిత్రని తెరకెక్కించే సమయంలో చరిత్రలో 65 ఏళ్ళు గడచి ఉంటే చాలన్నారు. నరసింహారెడ్డిని అతడి కుటుంబ సభ్యులకు, కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయడం ఇష్టం లేదు. అయన దేశం కోసం పోరాడిన వ్యక్తి. ఉయ్యాలవాడ ప్రాంతం కోసం పోరాడిన వ్యక్తి. నేనేదైనా చేయాలనుకుంటే ఆయన ఊరికోసం కానీ, ప్రజల కోసం కానీ చేస్తాను. నలుగురు వ్యక్తులకోసమో, కుటుంబ సభ్యుల కోసమో నేనేది చేయను అని చరణ్ తేల్చి చెప్పాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: