భారతదేశ స్వాతంత్య్ర పోరాటం అనగానే చాలా మంది పేర్లు గుర్తుకు వస్తాయి.కానీ వాళ్లందరికంటే ముందే బ్రిటిష్ పాలనపై కత్తి దూసిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.ఒక స్వాతంత్య్ర యోధుడి కథను,గాథను అందరు గర్వపడేలా చూపించాలి,గొప్పగా చెప్పుకునేలా తెరకెక్కించాలి అని చిరంజీవి అండ్ రాంచరణ్ టీమ్ చేసిన ప్రయత్నం ఒకరకంగా విజయవంతమైందని చెప్పాలి.ఎందుకంటే'సైరా'ట్రైలర్ చూసిన వాళ్ళు ఎవరయినా కూడా ఈ విషయాన్ని ఒప్పుకోంటారు. సినిమాలో,గ్రాండియర్‌ని,వారియర్‌తో మిక్స్‌చేసి చిరంజీవి లుక్‌ని శాంపిల్‌గా చూపించిన చిత్రయూనిట్ ఇప్పుడు మూడు నిమిషాల ట్రైలర్‌తో సినిమాలో ఏముంది?,సినిమా ఎలా ఉండబోతుంది అనేది ప్రేక్షకులకు పరిచయం చెయ్యడానికి ప్రయత్నించిన విధానం మెచ్చుకోదగ్గది.



ఇక ఈ ట్రైలర్'భారతమాతకి...జై' అంటూ మొదలవ్వడం భారతమాత పై వున్న గౌరవాన్ని ప్రేక్షకుల మదిలోకి మరోసారి చొప్పించడమే కాకుండా,భారతమాత స్వాతంత్య్రం గురించి పోరాడిన ఒక యోధుడి గురించి చెబుతున్నప్పుడు ఆ యోధుడి గురించి కాకుండా అతని ఆశయం గురించి చెప్పడం అనే సెన్సిబిల్ పాయింట్‌తో ట్రైలర్ కట్ చేసిన సురేందర్ రెడ్డి అక్కడే పూర్తిగా సక్సెస్ అయ్యాడు.ఇక ట్రైలర్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి లుక్ సూపర్‌గా ఉంది.ఇక ఈ సినిమాలో నరసింహారెడ్డితో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో సుదీప్ పాత్ర కన్నడ నుండి,విజయ్ సేతుపతి పాత్ర తమిళనాడు నుండి వచ్చి పాల్గొనడం అనే పాయింట్ కూడా చాలా బావుంది.ఎదో పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈ సినిమాలో వాళ్ళను పెట్టారు అనే విధంగా కాకుండా వాళ్ళు ఈ సినిమాలో ఉండడానికి ఇంతకు మించిన జస్టిఫికేషన్ ఇంకేమీ ఉండదు అన్నట్లుగా మలిచారు.



ఇక తమన్నా,నయనతార పాత్రలు కూడా వందశాతం ఈ సినిమాకు న్యాయం చేసాయనిపిస్తుంది.ఇక ప్రత్యేకంగా నరసింహా రెడ్డి గురువుగా అమితాబ్ కూడా ఒక క్రూషియల్ రోల్ పోషించినట్టు తెలుస్తుంది.మొత్తంగా ఈ సినిమా ట్రైలర్ ఒక కొత్త చరిత్ర సృష్టించిందని తెలుస్తుంది.ఎలా అంటే కేవలం విడుదలయిన గంట వ్యవధిలో ఏకంగా 2 మిలియన్ వ్యూస్ సాధించింది ఇది చాలదా ఈ సినిమా సృష్టించబోయే సంచలనాలు అంచనా వెయ్యడానికి.ఇక ఈ ట్రైలర్‌ని సెలబ్రిటీలు కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నారు.దీంతో సైరా కేవలం ఈ ఒక్క రికార్డ్‌తో సరిపెట్టుకోదు అనిపిస్తుంది.ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ సైరా ముందు తలవంచు తాయో.ఓవరాల్‌గా చెప్పాలంటే సైరా ట్రైలర్ రాక్స్.అంతే కాకుండా చిరు మరోసారి తన క్రేజ్‌ను ఏమాత్రం కోల్పోలేదని నిరూపణ కూడ అయ్యింది. ఇక లేటు వయస్సులో మరో లేటేస్ట్ రికార్డ్ మెగాస్టార్ స్వంతం కాబోతుందని అభిమానులు ఇప్పటి నుండే సంబరాల్లో మునిగి తేలుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: