‘ఎఫ్ 2’ సక్సస్ తరువాత వెంకటేష్ ఎన్నో ఆలోచనలు చేసి నాగచైతన్యతో కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ షూటింగ్ ఇంచుమించు పూర్తి అయినప్పటికీ ఈ మూవీ క్లైమాక్స్ విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతున్నట్లు టాక్. ఈ మూవీలో మేనమామ గండంతో నాగచైతన్య పుడతాడు. జాతకాలు అంటే విపరీతమైన నమ్మకం ఉండే వెంకటేష్ ఈ గండం నుండి తప్పించు కోవడానికి అనేకమంది సిద్ధాంతుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. 

ఆర్మీలో పనిచేసి వచ్చిన వెంకటేష్ కు ఆ ఊరు సమస్యలు తీర్చాలనే ఆలోచనతో పాటు తన మేనల్లుడు నాగచైతన్య వల్ల వచ్చే గండం గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాడు. ఈ మూవీ క్లైమాక్స్ లో కొందరి విరోధుల చేతులో వెంకటేష్ పాత్ర కథ రీత్యా మరణించడంతో ఈ మూవీ విషాదాంతంగా ముగిసే విధంగా దర్శకుడు బాబి తీసినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ క్లైమాక్స్ సీన్స్ ను చూసిన వెంకటేష్ నాగచైతన్యలకు ఆ క్లైమాక్స్ నచ్చక పోవడంతో మళ్ళీ మార్చి తీయమని దర్శకుడుకి సలహాలు ఇచ్చినట్లు టాక్. దీనితో మహేష్ బాబు ‘మురారి’ మూవీలో జాతక రీత్యా మృత్యువు వరకు వెళ్ళి వచ్చి తిరిగి మహేష్ పాత్ర బ్రతికినట్లుగా ఇప్పుడు వెంకీ పాత్రను మారుస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈమూవీ విడుదల దసరాకు రావలసి ఉన్నా ‘సైరా’ ఎఫెక్ట్ వల్ల దీపావళికి మార్చాలని భావించారు. అయితే సెంటిమెంట్ రీత్యా దీపావళి తెలుగు సినిమాలకు కలిసిరాదు అన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ఈ మూవీని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే డిసెంబర్ నెలలో వచ్చిన చాల తెలుగు సినిమాలు పెద్దగా విజయం సాధించని ట్రాక్ రికార్డ్ ఉన్న నేపధ్యంలో ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్న కన్ఫ్యూజన్ కొనసాగుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: