హిట్స్ పరంగా ‘సైరా’ ట్రైలర్ కొనసాగుతున్న పరిస్థితులలో ఈ ట్రైలర్ లో బయటపడని టాప్ సీక్రెట్స్ గురించి ఇప్పడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ మూవీ ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర పోషిస్తున్న అనుష్కతో ప్రారంభం అయ్యే నేపధ్యంలో ఆమె పాత్రను ఎందుకు రహస్యంగా ఉంచారు అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు.   

అలాగే ఈ మూవీలో కీలకంగా వచ్చే అండర్ వాటర్ సీన్ అలాగే నదిలో పడవల సీన్ లకు సంబంధించి ఒక్క సీన్ ను కూడ ఈ ట్రైలర్ లో పెట్టకపోవడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కీలకంగా ఉండే కొన్ని సీన్స్ ను కొద్దిగా కూడ చూపెట్టకుండా ఒకేసారి ప్రేక్షలకు థియేటర్స్ లో చూపించి వారిని ఆశ్చర్యపరిచే వ్యూహంలో ఈ కీలక సీన్స్ అన్ని దాచేసారని వార్తలు వస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా ఈ మూవీ  టికెట్ ను  యూనిఫామ్ గా 200ల రూపాయలకు ఫిక్స్ చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలలోని అన్ని సింగల్ థియేటర్స్ లోను ఈ విధానాన్ని అమలు పరిచి అత్యంత భారీ ఓపెనింగ్స్ పై కన్నేసారు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి  తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల మేరకు బిజినెస్ జరిగిన నేపధ్యంలో  ఈ మూవీ నెట్ కలక్షన్స్ కనీసం 130 కోట్లు దాటి రావాలి. 

అలాంటి ఫిగర్స్ రావాలి అంటే ‘సైరా’ కు ‘బాహుబలి 2’ మార్క్ ను మించి నెట్ కలక్షన్స్ రావాలని లేకుంటే ఈ మూవీ బయ్యర్లకు ఊహించని నష్టాలు తప్పవు అన్న ప్రచారం అప్పుడే ఇండస్ట్రీ వర్గాలలో మొదలైపోయింది. అయితే చిరంజీవికి ఉన్న  క్రేజ్ రీత్యా ఇలాంటి స్థాయి కలక్షన్స్ రావడం చాల సులువు అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు ఈమూవీని కనీసం ఒకటికి రెండు సార్లు అందరూ ‘బాహుబలి 2’ చూసినట్లుగా చూసినప్పుడు మాత్రమే ఈ మూవీ బయ్యర్లు లాభ పడతారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: