బిగ్ బాస్ లో బుధవారం ఎపిసోడ్ చాలా ఫన్నీగా సాగింది. టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యుల లవ్ పపోజల్స్ తో, డాన్స్ లతో ప్రేక్షకులకి వినోదాన్ని పంచారు. టాస్క్ లో స్టూడెంట్స్ గా వ్యవహరించిన వారికి లవ్ ప్రపోజ్ చేయాలనే టాస్క్ ఇచ్చారు. అందరూ తమకు తోచిన రీతిలో టాస్క్ ని కంప్లీట్ చేశారు. కానీ ఇక్కడ అందరికంటే ఎక్కువ ఆకర్షించింది రాహుల్ హిమజల జంట అనే చెప్పుకోవాలి. రాహుల్, హిమజల లవ్ పపోజల్ అద్భుతంగా పేలడంతో పాటు వారిద్దరి డాన్స్ కూడా చాలా బాగుంది.


ముఖ్యంగా హిమజ ఇరగదీసిందనే చెప్పవచ్చు. తనకి డాన్స్ రాకపోయినా ఎక్కడా తడబడకుండా మొహంలో ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. తనకి డాన్స్ రాదనే విషయాన్ని హిమజ పర్ఫార్మెన్స్ మర్చిపోయేలా చేసింది. తన చూపులతో అందరినీ మంత్రముగ్ధులని చేసింది. డాన్స్ చేయడం అనే టాస్క్ తనకి సరైనది కాకపోయినా దాన్ని కూడా తనకి కావాల్సినట్టు మలుచుకోవడంలో సఫలీకృతం అయింది. నామినేషన్ లో ఉన్న హిమజకి ఇది బాగా కలిసొచ్చే అంశం.


ఎందుకంటే నామినేషన్ లో ఉన్నప్పుడు స్క్రీన్ ప్రెసెన్స్ కోసం అందరూ ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి బొక్క బోర్లా పడతారు. స్క్రీన్ ప్రెసెన్స్ దొరికినా కూడా  జనాల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయలేరు.ఆ విషయంలో హిమజ సక్సెస్ అయిందనే చెప్పాలి. దొరికిన ఛాన్స్ ని చాలా చక్కగా వాడుకుంది. ఆమె డాన్స్, ముఖకవళికలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.


ఇక ఆమెకి జోడీగా చేసిన రాహుల్ బాగానే చేసినప్పటికీ హిమజ ఎక్కువ మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా అందరికీ నచ్చిన విషయం ఏంటంటే, ఎప్పుడూ చూడని జంట ఇంత అద్భుతంగా చేయడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. మరి ఎపిసోడ్ లో ఉన్న పాజిటివిటీ ఓట్ల రూపంలో ఎలా కన్వర్ట్ అవుతుందో వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: