ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు వెళ్ళిపోతున్నారనేది చాలా ఆసక్తిగా మారనుంది. నామినేషన్ లో మహేష్, రాహు, హిమజలు ఉన్న కారణంగా ఎలిమినేషన్ చాలా టఫ్ గా జరగనుంది. దాదాపు ప్రతీవారం వీరు నామినేషన్ లో ఉంటున్నప్పటికీ తప్పించుకుంటూ వస్తున్నారు. కానీ ఈ వారం అలాంటి అవకాశం లేదు. ఎవరో ఒకరు ఇంటి నుండి బయటకు వెళ్ళాల్సిందే. ఎలిమినేషన్ లో ఉన్న ముగ్గురిని పరిశీలిస్తే, ముఖ్యంగా రాహుల్ కి బయట ఇమేజ్ బాగానే ఉంది.


గత కొన్ని రోజులుగా సీరియల్ గా నామినేషన్ లో ఉంటున్నప్పటికీ సేవ్ అవుతూ వస్తున్నాడు. అదీ గాక రాహుల్ గ్రూప్ అయిన వితికా, వరుణ్, పునర్నవిల ఫ్యాన్స్ కూడా రాహుల్ కి ఓట్లు వేసే అవకాశం కలదు. మరీ ముఖ్యంగా పునర్నవి సీజన్ మొత్తం నామినేట్ అవుతానని ఒప్పుకున్నాక కూడా అలా వద్దని చెప్పి తనే నామినేట్ అవడంతో ప్రేక్షకుల్లో అతనికి మంచి మార్కులు పడ్డాయి. అందువల్ల రాహుల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపించట్లేదు.


ఇక మహేష్ విట్ట విషయానికొస్తే, మహేష్ కి బయట ఫాలోయింగ్ ఉన్నప్పటికీ రాహుల్ కన్నా తక్కువనే చెప్పాలి. బాబా భాస్కర్ అభిమానుల ఓట్లు పడే అవకాశం తక్కువనే చెప్పవచ్చు. మహేష్ కి ఉన్న ప్లస్ ఏంటంటే గత కొన్ని రోజులుగా అందరితో స్నేహంగా ఉంటున్నాడు. మరి దాన్ని దృష్టిలో ఉంచుకుని అతనికి ఓట్లు వేస్తారేమో చూడాలి. ఇక నామినేషన్ లో ఉన్న మూడవ కంటెస్టెంట్ హిమజ విషయానికి వస్తే, బయట ఆమెకి పెద్దగా ఫ్యాన్ బేస్ లేదు.


అంతే కాకుండా ఇంట్లో కూడా ఆమె మీద వ్యతిరేకత బాగా పెరిగింది. ఆమె ప్రవర్తనపైనే ఎక్కువ మందికి కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సారి హిమజ డేంజర్ జోన్ లో ఉండే అవకాశం కలదు. కానీ, బుధవారం ఎపిసోడ్ లో ఆమె పర్ ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరించింది. దీనివల్ల ఆమెకి ఓట్లు పడే అవకాశం కలదు. ఏదైమైనా ఈ సారి ఎలిమినేషన్ చాలా ఆసక్తికరంగా ఉండనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: