టాలీవుడ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ వరుస హిట్స్ తో తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ఫిదా, తొలిప్రేమ,అంతరిక్ష లాంటి సినిమాలతో విజయం అందుకున్న వరుణ్ తేజ్ తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో సక్సెస్ అయిన 'జిగార్తండా' సినిమాను తెలుగులో 'వాల్మీకి' పేరుతో తెరకెక్కించారు. ఈ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.  ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ బిజీలో ఉన్నారు.

తాజాగా వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘ఎఫ్‌ 2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) మూవీస్ తర్వాత చాలా ప్రేమకథలు విన్నాను. అయితే లవ్ స్టోరీస్ కి ఒక వర్గం వారే కనెక్ట్ అవుతుంటారు..కానీ మాస్ మూవీ అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించవొచ్చు అనే అభిప్రాయంలో నేను ఉన్నాను. ఆ సమయంలో దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ‘దాగుడు మూతలు’ కథ చెప్పారు. ఆ తరహా మూవీస్ కాకుండా వేరే ఏదైనా ఉందా అని అడిగాను..అప్పుడు తమిళ మూవీ ‘జిగర్తాండ’ చూశావా? అని అడిగారు. చూశానంటే మళ్లీ చూడమన్నారు. అలా ‘వాల్మీకి’ మొదలైంది.   ‘వాల్మీకి’లో తన లుక్ కోసం తన పెదనాన్న చిరంజీవి నటించిన నాటి మూవీ ‘పునాదిరాళ్లు’ను ప్రేరణగా తీసుకున్నానని చెప్పాడు.

ఈ మూవీలో చిరంజీవి లుక్ కు సంబంధించిన ఫొటోను వరుణ్ తేజ్ చూపించాడు. అంతే కాదు ఈ ఫోటో స్వయంగా మా పెదనాన్న చిరంజీవి గారే పంపారని తెగ సంతోషపడిపోయారు. అప్పట్లో హీరో అంటే ఇలాగే జుట్టుతో ఉంటారని తన అభిప్రాయమని చెప్పి, వరుణ్ నవ్వించారు.అయితే తమిళ మూవీ రిమేక్ అయినా..ఇందులో తెలుగు నేటివిటీ ఎక్కువ కనిపిస్తుందని అన్నారు. త‌మిళంలో విల‌న్ పాత్ర‌కు లేని ల‌వ్ ట్రాక్‌ను ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ యాడ్ చేశాడ‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు వ‌రుణ్ తేజ్‌. ఈ మూవీలో అధ‌ర్వ‌ముర‌ళి, పూజాహెగ్డే, మృణాళిని ర‌వి ఇత‌ర ప్రధాన పాత్ర‌ల్లో న‌టించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: