మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్ రాంచరణ్ నిర్మిస్తున్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.  చరిత్ర పుటల్లో కనుమరుగైన ఓ మహాయోధుని జీవిత గాధ...1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటీష్ సైన్యానికి శిస్తు కట్టే విషయంలో వ్యతిరేకించి తర్వాత తెల్లదొరలను భారత దేశం నుంచి వెళ్లిపోవాలని స్వతంత్ర పోరాటం చేసిన మహావీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 

ఆయన పోరాట స్ఫూర్తితో ఎంతో మంది బ్రిటీష్ సైన్యంపై కత్తి దూశారు. అంత గొప్ప వీరుడి కథ కనుమరుగు కావొద్దు అనే మహాసంకల్పంతో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ను తెరపైకి తీసుకు వచ్చేలా చేశారు.  వాస్తవానికి మెగాస్టార్ పది సంవత్సరాల క్రితమే ఈ ఆలోచనలో ఉన్నా..ఇప్పటికి తెరపైకి తీసుకు రాగలిగారు. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యే సమయానికి ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు నానా యాగీ చేస్తున్నారు.  ఈ సినిమా మొదలు పెట్టే సమయానికి తమకు ఐదు కోట్లు చిత్ర యూనిట్ ఇస్తుందని చెప్పి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని..ఇప్పటికీ ఆ విషయం ప్రస్తావించడం లేదని పెద్ద ఎత్తు గొడవ చేశారు..పోలీస్ స్టేషన్ మెట్లేక్కారు, మొన్న కూడా కుటుంబ సభ్యులు గొడవ చేశారు. తమ పొలాల్లో షూటింగ్‌ చేసి వాటిని నాశనం చేశారని ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు.   

తాజాగా నిన్న ట్రైలర్ లాంచ్ సందర్భంగా రాంచరణ్ గతంలో ఉయ్యాలవాడ కుటుంబాలను కలిశానని వారితో మాట్లాడానని చెప్పారు. ఒక వ్యక్తి జీవిత చరిత్రను తీసేటప్పుడు 100 సంవత్సరాల దాటిన తరువాత దాన్ని ఎవరైనా తీసుకోవచ్చని  ఇది సుప్రీంకోర్టు తీర్పనిఅన్నారు.  అయితే తాము గొప్ప వ్యక్తి చరిత్రను ఆవిష్కరిస్తున్నామన్న తృప్తి మాకు ఉంది. అలాగే  స్వాతంత్య్ర సమరయోధుడిని ఒక కుటుంబానికి లేదా కొంతమంది వ్యక్తులకు పరిమితం చేయడమనేది తనకు అర్ధం కావడం లేదని అన్నారు. ఒకవేళ సహాయం చేయాల్సి వస్తే..ఉయ్యాలవాడ అనే ఊరి కోసం చేస్తానని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: