మాస్ అండ్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. అదుర్స్‌తో కామెడీని కూడా హ్యాండిల్ చెయ్యగలడని ప్రూవ్ చేసాడు. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం:150 తర్వాత సాయి ధరమ్ తేజ్‌తో చేసిన ఇంటిలిజెంట్, వినయ్ కెరీర్‌ని డైలమాలోకి నెట్టేసింది. కట్ చేస్తే, వినాయక్ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటి వరకు తెర వెనక యాక్షన్ చెప్పిన ఆయన త్వరలో మరొకరు యాక్షన్ చెప్తే, యాక్ట్ చెయ్యనున్నాడు. సాధారణంగా సీన్ షూట్ చేసేటప్పుడు హీరోలకు తను నటించి చూపిస్తుంటాడు వినాయక్.. చిరంజీవి ఠాగూర్, ఖైదీ నెం:150 సినిమాల్లో కాసేపు తెరపై తళుక్కుమన్నాడు.


ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా అరంగేట్రం చెయ్యబోతున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, వినయ్‌ని హీరోగా లాంచ్ చేస్తున్నాడు.  దిల్ రాజు నిర్మాతగా తీసిన మొదటి సినిమా దిల్‌కి డైరెక్టర్ వినాయకే. తనని నిర్మాతగా పరిచయం చేసిన దర్శకుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యనున్నాడు దిల్ రాజు. శరభ ఫేమ్ ఎన్. నరసింహరావు ఈ సినిమాని డైరెక్ట్ చెయ్యనున్నాడు. ఆయన ఏజ్‌కి, ఫిజిక్‌కి తగిన ఓ పాత్రతో మాంచి స్క్రిప్ట్ ఒకటి ఆయ‌న ద‌గ్గ‌ర‌కు రావడంతో ఆయన ఓకె చెప్పార‌ట‌. వినాయ‌క్ ద‌గ్గ‌ర‌కి ఆ స్ర్కిప్ట్‌ని పంపించింది ఎవ‌రో కాదు దిల్ రాజు. డైరక్టర్ శంకర్ అసిస్టెంట్ నరసింహారావు చెప్పిన క‌థ దిల్ రాజుకు బాగా నచ్చింది. దీంతో వివి వినాయక్‌ను నెరేషన్ ఇప్పించడం, ఆయన వెంటనే ఒకే అనడం జరిగిందని స‌మాచారం. దర్శకులు నటులైనప్పుడు చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తుంటారు. పూర్తిస్థాయి నిడివి ఉన్న పాత్రలు చేయడం అరుదైన విషయం. అయితే వినాయక్‌ ఇప్పుడు కథా నాయకుడిగా మారి ఆశ్చర్యపరుస్తున్నారు. వినాయక్ హీరోగా మారడానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వినాయక్ దర్శకుడిగా ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో వెంటనే బాలకృష్ణ తో సినిమా అవకాశం వచ్చింది. బాలయ్యతో చేసిన చెన్నకేశవరెడ్డి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ వెంటనే దిల్ రాజు నిర్మాతగా పరిచయం అవుతూ నితిన్ తో తీసిన దిల్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు వినాయక్.  నరసింహారావు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో వినాయక్ రైతు పాత్రలో నటిస్తార‌ట. ఇది 1940 ప్రాంతంలో జరిగే కథతో సాగుతుందని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: