గ‌త రెండు సీజన్ ల మాదిరిగానే ఈ సీజన్ లోనూ కూడా బిగ్ బాస్ విజ‌య‌వంతంగా దూసుకుపోతోంది. ఇప్ప‌టికే 8 వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షోలో వ‌చ్చే వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఈ వారం ఎలిమినేష‌న్లో ఫోన్‌ బూత్‌ టాస్కు ఇచ్చారు. నామినేట్ అయిన కంటెస్టెంటుల కోసం ఒకరికి ఒకరు త్యాగం చేసుకోవాల్సి వస్తుంది.


ఈ నేపధ్యంలో వరుణ్ తేజ్ కోసం శ్రీముఖి టాటూ వేసుకుంటే, హిమజ కోసం వరుణ్ పేడ తొట్టెలో పడుకున్నాడు, జ్యోతి కోసం మహేష్ హెయిర్ కి రెడ్ కలర్ వేసుకున్నాడు. శ్రీముఖి కోసం బాబా క్లీన్‌ షేవ్‌ చేసుకున్నాడు, పునర్నవి కోసం రాహుల్ 20 గ్లాసులు కాకరకాయ జ్యూస్ తాగి త్యాగం చేసాడు. అయితే మ‌హేష్‌ను సేవ్ చేయ‌డంలో హిమ‌జ ప్లాప్ అవ్వ‌డంతో మ‌హేష్ నామినేట్ అయ్యాడు.


ఇక రాహుల్ కోసం పున‌ర్న‌వి ప్ర‌తివారం ఎలిమినేట్ అవ్వాల్సి ఉండ‌డంతో అందుకు రాహుల్ ఒప్పుకోక త‌న‌ను తానే నామినేట్ చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ కెప్టెన్ అయినా వితిక సేఫ్ అయినా కంటెస్టెంట్లలో ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. దాంతో వితిక హిమజా ను డైరెక్ట్ గా నామినేట్ చేసింది.


ఇందుకు రెండు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి మ‌హేష్‌ను సేవ్ చేయ‌డంలో హిమ‌జ విఫ‌ల‌మ‌వ్వంతో పాటు తన భర్త అయిన వరుణ్ హిమజ కోసం పేడ‌తొట్టెలో ఉండి త్యాగం చేయ‌డం కూడా విత‌క‌కు న‌చ్చ‌లేదు. మొత్తానికి నామినేషన్ కి వెళ్లిన ముగ్గురిలో ఈ సారి హిమ‌జ ఎలిమినేట్ అవుతుంద‌ని అంటున్నారు. రోజు రోజుకు రాహుల్‌కు బ‌య‌ట ఫాలోయింగ్ పెరుగుతోంది. మ‌హేష్‌కు సైతం కామన్ పీపుల్స్‌లో ఫాలోయింగ్ ఎక్కువ‌గానే ఉంది. ఈ క్ర‌మంలోనే లీస్ట్ ఓటింగ్‌తో హిమ‌జ ఈ వారం ఎలిమినేట్ అవుతుంద‌నే తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: