మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. ఇటీవల తమిళ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ అనే సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్ మరియు ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి. 

ఇకపోతే రేపు గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ తన కెరీర్ లో మొదటిసారి గద్దలకొండ గణేష్ అనే మాస్ క్యరెక్టర్ లో నటిస్తుండగా, ఆయన సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు అథర్వ మరియు నటి మ్రుణాళిని రవి మరొక జోడిగా నటించడం జరిగింది. మంచి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఫ్యాన్స్ ను ఆకట్టుకునే కమర్షియల్ అంశాలు కూడా ఉన్నట్లు సమాచారం. 

తమిళ స్టోరీని కొంతవరకు మార్చి మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమాను దర్శకుడు హరీష్ తెరకెక్కించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన నితిన్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు వరుణ్ తేజ్, కాసేపటి క్రితం తన అధిఅరిక సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే వరుణ్ పెట్టిన ట్విట్టర్ పోస్ట్ ని రీట్వీట్ చేస్తూ, వాల్మీకి కి ఆల్ ది బెస్ట్, రేపు రిలీజ్ తరువాత మీ సినిమా గత్తర్ లేపాల అంటూ నితిన్ పోస్ట్ చేయడం జరిగింది. కాగా ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: