టాలీవుడ్ ఇండస్ట్రీలో పక్కా మాస్ డైరెక్టర్ వివి వినాయక్. మాస్ ప్రేక్షకులు పల్స్ రేట్ అనుగుణంగా సినిమాలు తెరకెక్కించి అద్భుతమైన హిట్లు అందుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ అలాగే ఇంకా చాలా మంది స్టార్ హీరోలతో వీవీ వినాయక్ తీసిన సినిమాలు అనేక అద్భుతాలు సృష్టించాయి. ఇటువంటి క్రమంలో తాజాగా వినాయక్ హీరోగా ఓ సినిమా ఇటీవల స్టార్ట్ అయింది అన్న విషయం అందరికీ తెలిసినదే. గతంలో చిరంజీవి నీ డైరెక్ట్ చేసిన ఠాగూర్ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెప్పించిన వి.వి.వినాయక్ తాజాగా మాత్రం పూర్తిస్థాయిలో సినిమాలో నటిస్తున్నాడు. అయితే తన వయస్సుకు తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ విధంగా స్టోరీ ఉండటంతో సినిమా చేయటానికి వి.వి.వినాయక్ ఒప్పుకున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి.


ముఖ్యంగా ఈ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు కోరిక మేరకు వివి వినాయక్ ఈ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాకు డైరెక్టర్ గా నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే స్టోరీ పరంగా చూసుకుంటే సినీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం 1940ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ సాగనుంది. ఈ సినిమాలో వినాయక్‌ రైతు పాత్రలో కనిపిస్తారని సమాచారం. అలాగే తాతగా,మనవడుగా ఈ సినిమాలో వినాయిక్ డ్యూయిల్ రోల్ లో కనిపిస్తాడంటున్నారు. దీంతో ఈ వార్త విన్న చాలా మంది ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఎవరూ ఊహించని క్యారెక్టర్ వివి వినాయక్ చేస్తున్నారని అంటున్నారు.


ఈ సినిమాని వినాయక్‌ పుట్టినరోజు అయిన అక్టోబర్‌ 9న పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టానున్నారు. ఆ రోజు నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది. 10 వతేదీన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారట. అంతేకాకుండా తన పాత్ర కోసం కొద్దిగా లావు తగ్గడానికి వివి వినాయక్ జిమ్ లో వర్క్ అవుట్ కూడా స్టార్ట్ చేశాడట. ఈ సినిమాలో వినాయక పక్కన హీరోయిన్ శ్రేయ నటిస్తున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఇంకా ఈ వార్త బయటకు రాలేదు. గతంలో శ్రేయ టీవీ9 దర్శకత్వంలో చెన్నకేశవరెడ్డి, ఠాగూర్ సినిమాలో నటించింది. ఇండస్ట్రీలో డైరెక్టర్ గా రాణించిన వివి వినాయక్ సినిమా హీరోగా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: