హెడ్‌లైన్ చూసి భయపడకండి.కంగారు పడకండి.అసలు విషయం ఏమిటంటే భారతీయుడు సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటిసారిగా డబ్బింగ్ తో వచ్చిన చిత్రం. ఇందులో కమల్ హాసన్ నటనకు ఒకరేమిటి,యావత్ ప్రజానీకం ఫిదా అయిపోయారు.ఈ సినిమా వచ్చి చాలా ఏళ్ళు అయినా ఇప్పటికీ అందులో ఉన్న డైలాగ్స్ గాని, సంభాషణలు గాని,ఎప్పటికి మరచిపోకుండా చేసాయి.ఎక్కడైన అన్యాయం జరిగితే ఇలాంటి ఓ పెద్ద మనిషి వస్తే బాగుండును అనిపించేలా,ఆలోచింప చేస్తుంది ఈ సినిమా. అయితే దానికి సీక్వెల్ గా ప్రస్తుతం కమల్ హాసన్‘భారతీయుడు-2’సినిమా తీస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో కమల్ హాసన్ కు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా,ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు లో చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ శంకర్.



ఇప్పటికే రోబో 2.ఓ తో ప్రేక్షకులను నిరాశపరచిన శంకర్ ఇప్పుడు ఈ చిత్రంతో ప్రభంజనం సృష్టిస్తాడో లేక కమల్‌ను బలిచేస్తాడో చూడాలి.ఇక ఈ చిత్రం గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తిన కారణంగా,అంతేకాకుండా,కమల్‌ రాజకీయ వ్యవహారాల్లో పూర్తిగా మునిగిపోవడంతో మధ్యలోనే నిలిచిపోయింది.ఇక 1999లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ 'భారతీయుడు'చిత్రానికి సీక్వెల్‌ గా వసున్న ఈ మూవీని కాస్త చతికిల పడ్డ శంకర్‌ కొంచెం సీరియస్ గా తీసుకుని ముందుకు నడిపిస్తున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌జైల్లో ఈ మూవీ షూటింగ్‌ 15 రోజులపాటు చిత్రీకరించనున్నారట.కమల్‌ ఇందులో స్వాతంత్య్ర సమరయోధుడుగా,సేనాపతి పాత్రలో కనిపించనున్నాడని వినికిడి.ఇక కమల్‌ హాసన్‌ తో పాటుగా,ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సిద్ధార్థ్‌,కాజల్‌ అగర్వాల్‌ తదితరులునటిస్తున్నారు.



లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్ర.షూటింగ్‌ ఇక్కడ పూర్తయితే తరువాతి షెడ్యూల్‌ కోసం యూనిట్ అంతా విదేశాలకు పయనమయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా లైన్ అంతా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల మీదే ఉండనుందని అంటున్నారు.లైకా ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా,కెమెరామేన్‌ గా రత్నవేలు తన పనితనం చూపిస్తుండగా,అనిరుద్‌ రవిచందర్‌ బాణీలు అందిస్తున్నాడు.ఇక ఈ చిత్రం మొదటి భారతీయుడిగా,భారతీయుల గుండెల్లో నిలిచిపోద్దో.లేక రోబో 2.0 లా హడావుడి చేస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: