న్యాచురల్  స్టార్ నాని కి జోడిగా 'గ్యాంగ్ లీడర్' అనే చిత్రంలో  నటించింది  మలయాళ బ్యూటీ  ప్రియాంక అరుళ్ మోహన్.  తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా.   ఈ చిత్రంలో  ప్రియాంక క్యూట్  లుక్స్ కు  యూత్ ఫిదా అయ్యింది. దాంతో ప్రస్తుతం ఆమె  టాలీవుడ్ లేటెస్ట్ క్రష్ గా మారిపోయింది.  ఇక ఇటీవల  విడుదలైన ఈచిత్రం అనుకున్నంత స్థాయిలో  ఆడడం లేదు కానీ  ఈ చిత్రం లో ప్రియాంక గ్లామర్ పరంగా మాత్రమే కాకుండా  నటన తోనూ మెప్పించింది.  ఇక  ఈ బ్యూటీ కి ఇప్పుడు   ఆఫర్లు క్యూ కడుతున్నాయి. 




అందులో భాగంగా ప్రియాంక   కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.  తమిళ స్టార్ హీరో  శివ కార్తికేయన్, కోలమవు కోకిల ఫేమ్ నెల్సన్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనుంది.  ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్   హీరోయిన్ గా నటించనుంది.  అయితే  ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి  చాలా సమయం పట్టేలా వుంది. ఎందుకంటె శివ కార్తికేయన్  ప్రస్తుత్తం  నమ్మ వేలు పిళ్ళై అలాగే  పీఎస్ మిత్రన్ డైరెక్టన్ లో హీరో అనే చిత్రంలో నటిస్తున్నాడు.



ఈసినిమా లే కాకుండా  శివ కార్తికేయన్, రవికుమార్ ,విగ్నేష్ శివన్ లతో  సినిమాలు చేయాల్సింది వుంది.  దాంతో  ఇవ్వన్నీ పూర్తి చేసిన తరువాతే  నెల్సన్ సినిమాను మొదలుపెట్టానున్నాడు.  మరి ఈ చిత్రంతో  ప్రియాంక అక్కడ బిజీ అవుతుందేమో చూడాలి.   త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. ఇక ప్రియాంక ఈ సినిమాతో పాటు తెలుగులోనూ ఓ యంగ్ హీరో సరసన  నటించడానికి ఓకే చెప్పిందని సమాచారం.  త్వరలోనే ఆ సినిమా కు సంబంధించిన అప్డేట్ వెలుబడనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: