సాహిత్య కళ అనేది,తెలియ చెప్పే భావన యొక్క మూలం.ఈ మూలాలను నరనరాన జీర్ణించుకున్న వ్యక్తి, భరణి.ఆలియాస్ తణికెళ్ళభరణి,గారు.నటనలోను,ఓవక్తగా, ఆధ్యాత్మికవేత్తగా,దర్శకుడిగా మనలో ఆయన ఎంత మందికి తెలుసు.ఆయన భక్తిలో ఆర్తిని ఆటకదరా శివలో చూపించిన విధానం ప్రతి భక్తుని కంటకన్నీరు పెట్టిస్తుంది.ఇక విలనిజం చూపించినప్పుడు ఛీ ఇలాంటి వాడు ఇంటికొకడుంటే ఆ ఇల్లు సర్వనాశనమే అనిపిస్తుంది.తండ్రిగా హృదయాల్ని తడిపేస్తే,అనుచరుడిగా అడుగు అడుగున సినీ లోకంలో అందలమెక్కాడు.అన్నగా,తమ్ముడిగా ఇలా ఏ పాత్ర తీసుకున్నా,సినీ వినీలాకాశమనే వెండితెరపై మిలమిలమని మెరుస్తాడు.అందుకే ఆయనదొక ప్రత్యేక శైలి అంటారు.ఆయన జీవితం రంగస్థలం నుంచి మొదలై వెండితెర లో ఎన్నో విజయ శిఖరాలను అందుకుంది.



తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్‌ సెట్టర్‌ 'శివ'కు ఆయన అందించిన సంభాషణలు ఇప్పటికి మరపురావు.ఇక చాలా మందికి తనికెళ్ల భరణి కేవలం నటుడుగా మాత్రమే తెలుసు. కానీ ఆయన రచయితగా ఎంతో గొప్ప తెలుగు భాషాభిమానిగా కొందరికి మాత్రమే తెలుసు ఆయన కవితల్లో మాటల్లో తెలుగుదనంలోని తీయదనం చాల సృష్టంగా కనిపిస్తుంది.కేవలం దైవాను గ్రహం వల్లనే మనిషి బతకగలుగుతున్నాడు అనే నమ్మకం చుట్టు ఆయన ఆలోచనలు తిరుగుతాయి.



ఇక తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో విద్యార్థినులతో నిర్వహించిన ముఖా ముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సుమారు 750 కు పైగా నటించిన చిత్రాలలోని విషయాలను,అంతేకాకుండా ఆయన కవిత్వం,రచనలు,దర్శకత్వం, తాను పోషించిన పాత్రల్లో ఎదురైన విజయాలు, పరాజయాలు, అనుభవాలు, అనుభూతులు అన్ని విద్యార్థినులతో పంచుకున్నారు.వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చాల చక్కగా చెప్పాడు.ఇక నేను‘సినిమాల్లో మాత్రమే నెగటివ్‌ పాత్రలు చేస్తాను.నా ఆలోచలన్నీ పాజిటివ్‌గానే ఉంటాయని భరణి పేర్కొన్నారు.ఈ సందర్భంగా శివుడిపై రెండు భక్తి గీతాలను పాడి వినిపించారు.‘నెగటివ్‌గా ఆలోచించకండి.ప్రతి ఒక్కటీ పాజిటివ్‌గా తీసుకోండి’అని వారికి సూచించారు..





మరింత సమాచారం తెలుసుకోండి: