మెగాస్టార్ చిరంజీవి... మరో సారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయబోతున్నారు. తాజాగా విడుదలైన తన 151 వ సినిమా సైరా నర్సింహా రెడ్డి ట్రైలర్ తో యూట్యూబ్ రికార్డ్స్, సోషల్ మీడియాలో ఫైర్ పుట్టించాడు. ట్రైలర్ పై సినీ ప్రముఖులే కాదు విమర్శకులు సైతం ప్రశంసలు కురుపిస్తుండగా.... చిరు ఫాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. చిరు 150 వ సినిమా ఖైదీ నంబర్ 150 ని నిర్మించిన తనయుడు రామ్ చరణ్ ... తన 151 వ సినిమా సైరాను గొప్ప ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు.


పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన సినిమాలో ... అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయన తార, తమన్నా లాంటి సూపర్ స్టార్స్ మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ట్రైలర్ లో ఒక్కో ఫ్రేమ్ ను చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. తెర పై తొలి స్వాతంత్ర్య సమరయోధుడుగా మెగాస్టార్ గర్జన... తన హార్డ్ వర్క్, డెడికేషన్ కు అద్దం పట్టేలా ఉంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెతకు నిలువెత్తు నిదర్శనంలా కనిపించే చిరు ఒక హీరో తన మొదటి సినిమాకి ఎంత కష్ట పడతాడో... అంతకంటే ఎక్కువ తపన తన యాక్టింగ్ లో చూపించాడు. సైరా సినిమా చిరుకు తొలి సినిమానా అనిపిస్తుంది. దీంతో అభిమానులు మాకు ఇంకో 150 సినిమాలు కావాలి అన్నయ్య అంటున్నారు.


తొలి స్వాతంత్ర్య సమరయోధుడు నరసింహారెడ్డిని చరిత్ర మరిచిపోయి ఉండొచ్చు ... కానీ మేము గుండెల్లో పెట్టుకుంటాం అని తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సైరా సినిమాతో చిరు కెరియర్ లో మరో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ పడిందని ఆనందపడి పోతున్నారు. అయితే అక్టోబర్ 2న సైరా సినిమా దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్నా... ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి వంశీయులం అంటూ కొందరు కోర్టుకు ఎక్కారు. ఇన్నాళ్లు ఈ విషయాన్ని పట్టించుకోని నిర్మాత చరణ్... ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమంలో దీనిపై స్పందించారు. నర్సింహారెడ్డి వంశస్థులు అని చెప్పుకుంటున్న వారి బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి కథ వందేళ్లకు చరిత్ర అవుతుందని గుర్తుంచుకోవాలి అన్నారు. ఆ కథను సినిమాగా తీసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని చెప్పుకొచ్చారు చరణ్.


ఈ సినిమాలో నర్సింహారెడ్డి గురించి కొత్త విషయాలు తెలుస్తాయని... చాలా గొప్పగా ఉంటుందని తెలిపారు చరణ్. సినిమా మంచి హిట్ అందుకుంటుందని... ప్రజల ఆదరణ మాకు ఎప్పుడు ఉంటుందని నమ్ముతున్నామని అన్నారు. మొత్తానికి సైరా మన తెలుగు సినిమా స్టామినాను మరో సారి చూపించబోతుందని ధీమాగా ఉన్నారు అభిమానులు. మూవీని వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: