నాని -విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఇటీవల విడుదలైన  ఈచిత్రం మిక్సడ్ రివ్యూస్ ను తెచుకున్నప్పటికీ  మొదటి మూడు రోజులు  బాక్సాఫీస్ వద్ద  భారీగా వసూళ్లను రాబట్టింది. అయితే వీక్ డేస్ లో కి  ఎంట్రీ ఇవ్వగానే మాత్రం ఈ చిత్రం తేలిపోయింది. రోజు రోజుకి ఈసినిమా  కలెక్షన్స్ భారీగా డ్రాప్ అవుతున్నాయి. 


ఈచిత్రం 6రోజుల్లో  తెలుగు రాష్ట్రాల్లో  కేవలం 14.19కోట్లషేర్ ను మాత్రమే రాబట్టిందని సమాచారం. కాగా  ఏపీ &తెలంగాణ లో ఈచిత్రం  20కోట్ల కు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం తో బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు.  ఇక రేపు  సూర్య నటించిన బందోబస్త్ , వరుణ్ తేజ్ వాల్మీకి  థియేటర్లలోకి రానుండడంతో  గ్యాంగ్ లీడర్ కు అసలు సిసలైన పరీక్ష ఎదురుకానుంది. ఒకవేళ ఈ రెండు సినిమాలకు హిట్ టాక్ గనుక వస్తే  గ్యాంగ్ లీడర్ పరిస్థితి మరింత దిగజారునుంది. రివేంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో   ప్రియాంక అరుళ్  మోహన్  హీరోయిన్ గా నటించగా..   సీనియర్ నటీమణులు లక్ష్మి , శరణ్య ముఖ్య పాత్రల్లో నటించారు.  కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో  ఆర్ ఎక్స్ 100ఫేమ్ కార్తికేయ విలన్ రోల్ లో కనిపించాడు.  మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 


తెలుగు రాష్ట్రాల్లో గ్యాంగ్ లీడర్  6రోజుల కలెక్షన్ల  వివరాలు : 

నైజాం  - 5.75 కోట్లు 

సీడెడ్ - 1.76 కోట్లు 

నెల్లూరు - 47లక్షలు 

గుంటూరు -1.13కోట్లు 

కృష్ణా - 1.08కోట్లు 

తూర్పు గోదావరి - 1. 24 కోట్లు

పశ్చిమ గోదావరి - 86లక్షలు 

ఉత్తరాంద్ర - 1.90కోట్లు 

మొత్తం  ఏపీ &తెలంగాణ లో 6రోజులకుగాను షేర్ - 14.19 కోట్లు 


మరింత సమాచారం తెలుసుకోండి: