తెలుగు సినిమా హాట్ గర్ల్  హంసా నందిని ఇప్పుడందరినీ హీట్ ఎక్కించే పనిలో పడింది. హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హంసానందిని. తనకంటూ ఒక మార్క్ వేసుకోలేకపోయింది. అయితే, వరుసపెట్టి సినిమాలైతే చేస్తోంది. దర్శక, నిర్మాతలు ఆమెకు ప్రత్యేకమైన పాత్రలు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్‌గా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ పొడుగు కాళ్ల సుందరి సెక్సీ, హాట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది.సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తుంది.

తాజాగా అలాంటి కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో హంస సెక్సీగా ఉంది. ఇది స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకున్న ఫొటోషూట్. నలుపు రంగు స్విమ్ సూట్ వేసుకుని, నడుము చుట్టూ ఒక చిన్న టవల్ చుట్టుకుని అందాలను చూపించీ చూపించనట్టు కైపెక్కించే చూపుతో అలరించింది.

తెలుగులో ‘ఒకటవుదాం’ అనే సినిమా ద్వారా హంసా నందిని తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరవాత వంశీ ‘అనుమానాస్పదం’ సినిమాతో హంసకు గుర్తింపు వచ్చింది. కానీ, హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ వస్తోంది. అవి కూడా హాట్ హాట్ రోల్స్. అలాగే ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తోంది. ఇటీవల లెజెండ్, ‘జైలవకుశ’ వంటి భారీ చిత్రాలలో సపోర్టింగ్ రోల్ చేసిన హంసా నందిని.. చివరిగా గోపీచంద్ ‘పంతం’ సినిమాలో ఐటమ్ సాంగ్‌లో మెరిసింది.

టాలీవుడ్ లో చాలామంది ఐటంసాంగ్స్ చేస్తున్నా కొంతమంది కొన్నిరోజులకు కనుమరుగవుతున్నారు.ఈ కోవలో  ముమైత్ ఖాన్ కూడా ఉంది. మరిప్పుడు ఇంత సడెన్ గా అవకాశాలు రావాలంటే ఈ మాత్రం ఫాలోయింగ్ తప్పనిసరి..అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడే సంపాదించేసుకోవడం వీరికి మామూలే ఎందుకంటే అసలే పోటీ ఎక్కువ..ఎప్పుడు కనుమరుగు అవుతామో ఎవరికీ తెలియదు .తప్పదు మరి పబ్లిసిటీ లేకుంటే ఫ్యూచర్ ఉండదు కాదా..


మరింత సమాచారం తెలుసుకోండి: