సినిమాల్లో నటించిన వారు ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు.  కొంత మంది అయితే ఏకంగా సొంత పార్టీ స్థాపించి ప్రభంజనం సృష్టించారు.  అలాంటి వారిలో  నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అందరూ ఆయనను అన్నగా పిలిచే వారు.  తెలుగు దేశం పార్టీ స్థాపించి అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ పార్టీని ఓడించి ముఖ్యమంత్రిగా ఎన్నోకోబడ్డారు.  ఇక తమిళనాట ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. 

ఆయన వారసురాలిగా నటి జయలలిత ఆ పార్టీ ప్రతిష్ట పెంచి ముఖ్యమంత్రి గా కొనసాగారు.  ఇలా సినీ నేపథ్యం నుంచి వచ్చి రాజకీయాల్లో తన సత్తా చాటారు చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్.  2009,2014 లలో చిత్తూరు లోకసభ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు.  తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు.

ఖైదీ లాంటి హిట్‌ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఈయన 2006 సంవత్సరంలో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌గా నటించాడు.  తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్ ను వారంక్రితం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.

పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వివాదం సాగినన్ని రోజులూ రోజుకో వేషంతో అందరినీ ఆకట్టుకున్నాడు.  గత పది సంవత్సరాల నుంచి ఆయన ఎన్నో రకాల వేషాలు వేసి రక రకాల నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా శివ ప్రసాద్ పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన చికిత్స కోసం ఇవ్వాళ చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: