దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలు ఎంతటి విజయాలు అందుకున్నాయో మనకు అందరికీ తెలిసిందే. ఆ రెండు సినిమాలతో తెలుగు వారి ఖ్యాతిని దేశవిదేశాల్లో మారుమ్రోగేలా చేసిన దర్శకుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. అయితే రాజమౌళికి ధీటైన, ఒకరకంగా అంతకు మించిన గొప్ప దర్శకులు మన భారతీయ చలన చిత్ర రంగాల్లో ఉన్నప్పటికీ, ఆయన మాదిరిగా ఒక సినిమాను ప్రతిఒక్క ప్రేక్షకుడికి చేరువయ్యేలా తీయగల సత్తా ఉన్న దర్శకులు చాలా చాలా తక్కువ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక బాహుబలి సిరీస్ సినిమాల తరువాత వాటి స్పూర్తితో తెలుగులో ఇటీవల భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, అతి త్వరలో మరొక భారీ సినిమా సైరా నరసింహారెడ్డి రిలీజ్ కు సిద్దమవుతోంది. 

భారీ సినిమాలు ఎన్ని వస్తున్నప్పటికీ మన ప్రేక్షకులు ముందుగా గుర్తుచేసుకునేది మరియు ఆయా సినిమాలను పోల్చేది బాహుబలి తోనే అనేది తెలిసిందే. అయితే ఆ విధంగా చూస్తే సాహో చాలావరకు ఫెయిల్యూర్ అనే చెప్తున్నారు. ఇక అతి త్వరలో రాబోతున్న సైరా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి బాహుబలి సినిమాలకు మిగతా అంశాలు ఎన్ని ఉన్నా, ఎక్కువగా ప్రేక్షకులు నమ్మింది మాత్రం దర్శకుడు రాజమౌళినే అని చెప్పాలి. మరి ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం అవుతున్న సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి ఆ సినిమాను ఎంతవరకు సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించగలరు అనేది టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ విధంగా చూస్తే అది సైరాకు కొంత ఇబ్బందికర విషయమే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

ఎందుకంటే అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి, తోలి సినిమాతో మంచి హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి, ఆ తరువాత పలు విజయవంతమైన సినిమాలతో పాటు ఫ్లాప్స్ కూడా ఇచ్చారు. అదీగాక ఈ సైరా సినిమాకు అత్యంత భారీ రేంజ్ లో ఖర్చు చేస్తుండడంతో, ఆ ఖర్చుకు సురేందర్ రెడ్డి నిజంగా న్యాయం చేయగలరా అనేది కొంత అనుమానమే. వాస్తవానికి ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు ట్రైలర్, సైరా పై అంచనాలు పెంచేసినప్పటికీ, రాజమౌళి రేంజ్ లో సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించి న్యాయం చేయగలరా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. 

ఎందుకంటే సాధారణంగా ప్రేక్షకులు భారీ బడ్జెట్ సినిమాల టీజర్లు మరియు ట్రైలర్లు చూసి ఎన్నో ఆశలు పెట్టుకుని, రేపు సినిమా తప్పకుండా అదిరిపోతుంది భావిస్తుంటారని, అయితే వారు అనుకున్న అంచనాలకు ఏ మాత్రం కొంత తగ్గినా సరే, అది ఆ సినిమాకు పెద్ద దెబ్బేయడం ఖాయమని, అటువంటివి గతంలో జరిగి ఉండడడాన్ని మేము గుర్తు చేస్తున్నాము తప్ప, సైరా పై నెగటివ్ గా కామెంట్ చేయడం లేదని అంటున్నారు. అయితే కొందరు సైరా పై ఆ విధంగా అనుమానం వ్యక్తం చేయడంలో తప్పులేదని, కాకపోతే పూర్తిగా సినిమా వచ్చిన తరువాతనే దర్శకుడి ప్రతిభ వెలుగులోకి వస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సైరా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి......!!


మరింత సమాచారం తెలుసుకోండి: