దేవదాసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది గోవా బ్యూటీ ఇలియానా.  తొలి సినిమాతోనే కుర్రాళ్లకు మాత్రమే కాదు దర్శక, నిర్మాతలకు కూడా మత్తెక్కించింది.  ముఖ్యంగా ఇలియానా నడుం వొంపులపై ఎన్నో కామెంట్స్ వినిపిస్తుంటారు. అలాంటి అందాల రాశితో నటించాలని అప్పట్లో హీరోలు పోటీ పడేవారంటే అతిశయోక్తి లేదు.  టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే ఇలియానా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  అక్కడ కొన్ని సినిమాలు తీసినా దక్షిణాదిన ఉన్న క్రేజ్ మాత్రం తెచ్చుకోలేక పోయింది. 


బాలీవుడ్ లో ఉండగానే లవ్ లో పడటం..బ్రేకప్ చెప్పుకోవడం జరిగిపోయింది.  అయితే ఇటీవల కాలంలో ఇలియానా ఫిజిక్ విషయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి..ఆమె చాలా లావు అయ్యిందని..హీరోయిన్ గా పనికి వస్తుందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి.  దాంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఇల్లీబేబీ తన ఫిజిక్ పై ఫోకస్ చేయడం మొదలు పెట్టింది. ఆ మద్య రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంథోని సినిమాలో నటించింది. కానీ ఈ మూవీ ఇలియానా కు పెద్దగా పేరు తీసుకు రాలేదు..అంతేకాదు ఆమె బాగా లావుగా మారిందని కామెంట్స్ కూడా వచ్చాయి. దాంతో ఆమె ఫిజిక్ పై దృష్టికేంద్రీకరించింది. 


ఈ అమ్మడు బాగా వర్కౌట్స్, డైటింగ్ చేసినట్టుగాఉంది.. మునుపటి వయ్యారాలు చూపిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇలియానా తాజాగా పోస్ట్ చేసిన ఆ ఫోటో లో నడుముని, నాభిని చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. గోవా బ్యూటీ ఈజ్ బ్యాక్ అనేలా ఉంది ఇలియానా అందం. లూజ్ హెయిర్ లో చెయ్యి పెట్టి.. అందాలను చూపిస్తూ కళ్ళు మూసుకుని ఉన్న ఇలియానా ఫోజు చూస్తుంటే మరోసారి కుర్రాళ్ల మతులో పొగొట్టడానికి రెడీ అయినట్లు కనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: