గత కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్ తో పాటు, ప్రేక్షకులందరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సైరా ట్రైలర్ వచ్చేసింది. విడుదలైన మరుక్షణం నుంచి సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిపోతోంది. ప్రేక్షకుల నుంచి స్టార్స్ వరకు అంతా సైరా ట్రైలర్ ను అద్భుతం అంటూ పొగిడేస్తున్నారు. కానీ ట్రైలర్ లో ఒక ముఖ్యమైన ఎలిమెంట్ మాత్రం మిస్ అయింది. అదే పంచ్ డైలాగ్స్. మెగాస్టార్ అంటేనే పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్.

సినిమాలో హీరో ఎవరైనా, కథ ఏ జానర్ కు చెందినా అందులో పంచ్ డైలాగ్స్ ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా కీలకమైన కొన్ని డైలాగ్స్ ను ట్రైలర్ లో పెట్టడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. అయితే సైరా ట్రైలర్ లో అలాంటి డైలాగ్స్ మిస్ అయ్యాయంటున్నారు చాలామంది. చివర్లో చిరంజీవి చెప్పిన 'గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్' అనే డైలాగ్ తప్ప డైలాగ్స్ పరంగా ఏమాత్రం మెరుపుల్లేవని అందరు కాస్త నిరుత్సాహానికి, అసహనానికి లోనవుతున్నారు.

అయితే ఈ ట్రైలర్ లో అందరు అనుకున్నట్టుగా పంచ్ డైలాగ్స్ మిస్ చేయడానికి ఒక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. సైరా సినిమా 5 భాషల్లో రిలీజ్ అవుతోంది. మిగతా భాషల్లో జనాల్ని కూడా ఎట్రాక్ట్ చేయాలంటే సుదీప్, విజయ్ సేతుపతి, అమితాబ్ లాంటి నటుల డైలాగ్స్ పెట్టాల్సిందే. అలా చేయడం వల్లనే ట్రైలర్ లో అసలు పంచ్ మిస్ అయింది. అంతకుమించి మరే కారణంలేదట. సినిమాల్లో తూటాల్లా పేలే డైలాగ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ట్రైలర్ లో వాటిని చూపించలేదని చిత్ర బృందం చెప్తున్నారట. 
మరోవైపు ట్రైలర్ లో సినిమా కథ మొత్తం చూపించారనే విమర్శ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఇది దాచాల్సిన కథ కాదు. ఇది చరిత్ర. ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నమే ఎక్కువగా చేశాం. అందుకే అసలు కథను టచ్ చేస్తూనే ట్రైలర్ కట్ చేశాము. ప్రేక్షకుడ్ని సైరా వైపు ఎట్రాక్ట్ చేయడం, మితిమీరిన అంచనాల్లేకుండా చేయడంలో భాగంగానే  ట్రైలర్ ను ఇలా కట్ చేశామని యూనిట్ క్లియర్ గా సమాధానమిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: