వరుణ్ తేజ్ నటించిన 'వాల్మీకి' చిత్రం రేపు థియేటర్లలోకి రానుంది. అంటే ఈరోజు ఈ రోజు రాత్రికి ఓవర్సీస్ లో షో పడిపోతుంది అన్నమాట. భారీ అంచనాల నడుమ గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటినుంచి అనేక వివాదాలు మూటగట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ మార్చాలని ఒక కులానికి చెందిన వారు ముందు నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. 'వాల్మీకి' తమ కులానికి చెందిన వ్యక్తి అని... ఆ పాత్రను నెగిటివ్ గా చూపించడం పై బోయ కులస్ఠులు ముందు నుంచే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 

ఇంతకు మునుపు కూడా ఈ సినిమా షూటింగ్ సమయంలో బోయ కులస్తుల దగ్గర నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనంతపురం ముందబండపల్లిలో వాల్మీకి షూటింగ్ సమయంలో బోయ కులస్ఠులు చిత్ర యూనిట్ పై దాడికి కూడా దిగారు. దీంతో అర్ధాంతరంగా చిత్ర షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా వివాదం పూర్తిగా సద్దుమనగకముందే సినిమా విడుదలకు రెడీ అయినా.... వాల్మీకి చిత్రం ఒక్క చోట మాత్రం రేపు ఆడబోవడం లేదు. 

జిల్లాలో శాంతిభద్రతల దృష్ట్యా అనంతపురంలో వాల్మీకి సినిమాకి నో-ఎంట్రీ బోర్డు పెట్టారు కలెక్టర్. మిగిలిన చోట్ల యధావిధిగా భారీ ఓపెనింగ్స్ జరుపుకుంటున్న వాల్మీకి సినిమాకి అనంతపురంలో మాత్రం హౌస్ఫుల్ బోర్డులు పడవన్నమాట. సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ అనంతపురానికి చెందిన బోయ కులస్థులు జిల్లా కలెక్టర్ ని కోరడంతో వారి ఆగ్రహాన్ని చూసి కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదట. మరి వారు అనుకున్నట్లు ఆ సినిమాలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ నిజంగానే అంత బ్యాడ్ గా ఉందా లేదా ఇదంతా కేవలం వారి భ్రమేనా అని కొద్ది గంటల్లో తేలనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: