మెగా ఫ్యామిలీ హీరో అయిన వరుణ్ తేజ్ హీరోగా నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా వాల్మీకి. గతంలో పలు సినిమాల్లో క్లాస్ మరియు యూత్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన వరుణ్ తేజ్, తొలిసారి ఈ వాల్మీకి సినిమాలో గద్దలకొండ గణేష్ అనే పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి, సూపర్ హిట్ కొట్టిన జిగర్తాండ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్ మరియు థియేట్రికల్ ట్రైలర్ తరువాత ఆ అంచనాలు అమాంతం పెరిగాయి అనే చెప్పాలి. వరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మాస్ కథలను ఆకట్టుకునే కమర్షియల్ పంథాలో తెరకెక్కించగల హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీమియర్ షోలను నేడు తెల్లవారు ఝామున యుఏఈ, యుఎస్ఏ వంటి దేశాల్లో ప్రదర్శించడం జరిగింది. అయితే అక్కడ షోను వీక్షించిన ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందనను బట్టి, వాల్మీకి ద్వారా వరుణ్ తేజ్ ఖాతాలో మరొక మంచి హిట్ పడినట్లు సమాచారం అందుతోంది. తమిళ్ లోని జిగర్తాండ కథను చాలావరకు అలానే తీసిన దర్శకుడు హరీష్, కొన్ని సీన్స్ విషయంలో మాత్రం మార్పులు చేసినట్లు సమాచారం. ఇక హీరో క్యారెక్టర్ అయిన గద్దలకొండ గణేష్ క్యారెక్టర్ సినిమాకు మెయిన్ హైలైట్ అని అంటున్నారు. ఇక ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే వరుణ్ మరియు పూజ హెగ్డేల సీన్స్ అదిరాయని, ఇక అదే సమయంలో వచ్చే వెల్లువొచ్చి గోదారమ్మ రీమిక్స్ సాంగ్ మరింతగా ఆకట్టుకుందని అంటున్నారు. 

మరొక జంట అథర్వ మురళి మరియు మృణాళిని రవి కూడా తమ పాత్ర పరిధి మేరకు ఎంతో బాగా నటించారని, ఇక సినిమాలో వచ్చే జర్ర జర్ర అనే మాస్ సాంగ్ కు ఫ్యాన్స్ కు పూనకాలే అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో వరుణ్ తేజ్ తెలంగాణ యాసలో పలికిన డైలాగ్స్ కు థియేటర్స్ లో విజిల్స్ ఖాయమట. హీరో ఇంట్రడక్షన్ సీన్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్, ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్, సాంగ్స్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఛేజింగ్ మరియు యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, వండర్ఫుల్ విజువల్స్ వెరసి ఈ వాల్మీకి సినిమాకు మంచి విజయాన్ని అందించాయని టాక్ వినపడుతోంది. అయితే నేడు మార్నింగ్ షో టాక్ తరువాతనే ఈ వాల్మీకి ఏ రేంజ్ హిట్ సాధిస్తుంది అనేది చెప్పగలం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మొత్తంగా ఈ టాక్ తో వాల్మీకి ద్వారా వరుణ్ సూపర్ హిట్ కొట్టినట్లే అర్ధం అవుతోంది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: