బాహుబలి, సాహో ల తరవాత  దేశం మొత్తం ఎదురుచూస్తున్న సినిమా సైరా .. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, ఏ భాష లో ఎంతమేరకు ప్రొడ్యూసర్ లు ఈ సినిమా ని అమ్మేశారు .. హిందీ లో రికార్డ్ కొట్టిందా , కన్నడ బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్తితి ఏంటి , తెలుగు లో బాహుబలి ని మించుతుందా ఇవన్నీ ఈ వీడియొ లో చూద్దాం రండి ..సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయం చెప్పేముందు నేను మీకు ఎనభై, తొంభై లలో జరిగిన ఒక విషయం చెప్తాను .. ఎనభై లలో బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ మొదలు పెట్టిన హీరో చిరంజీవి 92 లో ది వీక్ మ్యాగజైన్ బెగ్గర్ దేన్ బచ్చన్ అని పిలిచే రేంజ్ కి వెళ్ళాడు .. 1992 సెప్టెంబర్ 13 న విడుదల ఐన ఈ మ్యాగజైన్ స్టోరీ లో చిరంజీవి ని అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోగా ఈ పత్రిక ప్రకటించింది అంటే చిరంజీవి రేంజ్ అప్పట్లో ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.


తెలుగు నాట సీనియర్ ఎన్‌టి‌ఆర్ తరవాత నెంబర్ 1 స్థానం కోసం ఎంతమంది వచ్చినా అందరినీ వెనక్కి నెత్తి సౌత్ ఇండియా లోనే కాక దేశ వ్యాప్తంగా తన మార్క్ ఏర్పరచుకున్న స్టార్ హీరో చిరంజీవి. మరి అలాంటి చిరంజీవి ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ఒక ఫ్రీడం ఫైటర్ స్టోరీ ని అందులోనూ దేశం లోనే బ్రిటీషర్ ల మీద తిరగబడిన మొట్టమొదటి పోరాట యోధుడి కథ ని తెరమీద చూపిస్తున్నప్పుడు దాని స్కేల్ ఎలా ఉంటుంది అనేది అర్ధం చేసుకోవాలి హిందీ లో అమితాబ్ బచ్చన్ ని , కన్నడ లో సుదీప్ నీ , తమిళ్ లో విజయ్ సేతుపతి ని తీసుకుని ఆయా భాషల్లో హైప్ ఏర్పరచడం లో ప్రొడ్యూసర్ రామ్ చరణ్ మొదటి నుంచీ సక్సెస్ అవుతూనే ఉన్నాడు .. చిరంజీవి అంటే సహజంగానే కన్నడ లో క్రేజ్ చాలా ఎక్కువ .. ఇక హిందీ , తమిళ ప్రేక్షకులకి చిరు సుపరిచితుడే .. కానీ మార్కెట్ ని కొల్లగొట్టడం రికార్డులు తిరగరాయడం అనేది ప్లేన్ మోడ్ లో వెళ్ళాడు రామ్ చరణ్...ప్రతి లాంగ్వేజ్ లో పాటలు సైతం సెట్ అయ్యేలా అన్నీ నేటివిటీ లనీ కలుపుకుంటూ వెళుతున్నారు సైరా టీం...నైజాం లో సై రా రికార్డు లు సృస్టిస్తూ 30 కోట్లకి అమ్ముడు పోయింది.


సీడెడ్ లో ఇరవై కోట్లు , ఉత్తరాంధ్ర లో 14 కోట్లు , గుంటూర్ ప్రాంతం లో 11 కోట్లు , ఈస్ట్ గోదావరి ప్రాంతం లో దాదాపు పది కోట్లు వెస్ట్ లో ఎనిమిదిన్నర కోట్లు , కృష్ణా ప్రాంతం లో తొమ్మిది కోట్లకి సైరా కొన్నారు నెల్లూరు  లో ఐదు కోట్లకి రికార్డ్ రేటు కి అమ్ముడుపోయింది. ఆంధ్ర - తెలంగాణ కలిపి నూట ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సైరా కర్ణాటక ₹27.00 కోట్లు, హింది వర్షన్ ₹25.00Cr, తమిళ్ నాడు ఇంకా ఇతర ప్రాంతాలకి ₹12.00Cr బిజినెస్ చేసింది .. ఓవర్ సీస్ లో 18 కోట్లకి రికార్డ్ రేట్ లో అమ్ముడైన సైరా మొత్తం నూట తొంభై కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది .. ఇండియన్ సినిమా చరిత్ర లో చిరంజీవి ఎప్పటికీ మకుటం లేని మహారాజు అనే విషయాన్ని సైరా నిరూపించింది ..ఆంధ్ర - తెలంగాణ ప్రాంతం లో నూట ఎనిమిది కోట్లు వస్తే చాలు సైరా హిట్ అని చెప్పచ్చు .. ఖైదీ నెంబర్ 150 చిత్రం 82 కోట్లకి అమ్ముడు పోయి 105 కోట్లు వరకూ రాబట్టింది.


సొ సైరా హిట్ అవ్వడం చాలా తేలికైన అంశం .. కర్ణాటక , తమిళ్ , హిందీ వెర్షన్ ల విషయం లో కాస్త సరైన ప్రమోషన్ ఉంటే తిరుగే ఉండదు మెగా రికార్డుల వేట కి . ఓవర్ సీస్ లో జనాలు  దేశం భక్తి కి సంబంధించిన సినిమా కాబట్టి థియేటర్ లకి ఎగబడతారు అని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. కాస్తంత సరైన కథ , వి‌ఎఫ్‌ఎక్స్ సరిగ్గా వర్క్ అయితే సైరా చిరంజీవి కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బుస్టర్ గా నిలవబోతోంది ..


మరింత సమాచారం తెలుసుకోండి: