ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలో లేకపోయినా.. సుడిగాలి సుధీర్ మాదిరే ఆమెపై మనసు పారేసుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అండ్ హాట్ యాంకర్‌గా పేరొందిన ఆమెకు మంచి ఫాలోయింగే ఉంది. అంతేకాదు అప్పుడప్పుడు సినిమాల్లోను మెరుస్తూ అందరిని బాగా ఆకట్టుకుంటోంది. ఇక రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ జబర్దస్త్ స్టేజ్‌మీద అందించే ఎక్స్ ట్రా ఫన్‌కి మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే. భాష మాట్లాడటం ఎలా ఉన్నా తన మాటలతో టీవీ ముందున్న ప్రేక్షకులను కదలనీయకుండా చేస్తోంది.

శుక్రవారం నాటి ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్... తన ‘వాల్మీకి’టీంతో కలిసి సందడి చేస్తున్నారు. జబర్దస్త్ షో‌కి జడ్జ్ నాగబాబు కావడంతో ఈ వారంలో సోలో పెర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్మీకి సినిమాని తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండా కి అఫీషియల్ రీమేక్ గా రూపొందించారు. తమిళ హీరో అధర్వ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇక అలనాటి దేవత సినిమాలోని వెల్లువొచ్చి గోదారమ్మా సాంగ్ ను వరుణ్ తేజ్-పూజా హెగ్డే లతో రీమిక్స్ చేశారు. 

ఇందులో ‘నాగబాబు సార్.. నేను మీకు సర్ ప్రైజ్ ఇస్తా.. మీరు నాకు ఏం ఇస్తారు అని రష్మి అడగడంతో.. నీకు ప్యాంటు షర్ట్ కొనిపెడతా మగపిల్లాడిలా ఉంటావ్.. అని పంచ్ పేల్చారు. అయితే ఈ సర్ ప్రైజ్ మీకు చెప్పను చూపిస్తా అంటూ వరుణ్ తేజ్, హరీష్ శంకర్, మృణాళినిలను స్టేజ్ మీదికి ఇన్వైట్ చేస్తూ.. నాగబాబుని మూడు ప్యాంట్లు, మూడు షర్ట్‌లు అడిగింది రష్మి. ఒక్కరికి ఒక ప్యాంటుషర్ట్ అన్నారు.. ఇప్పుడు ముగ్గుర్ని పిలిచాను కాబట్టి మూడు ఇవ్వాలని కోరింది రష్మి. ఏదేమైనా రష్మీ హీరోయిన్ గా కంటే కూడా యాంకర్ గా బాగా పాపులర్ అవడమే కాదు సంపాదనలోను హీరోయిన్స్ ని మించి పోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: