తొలివలపు సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత విలన్ గా ఫేమస్ అయ్యి  మళ్ళీ హీరోగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న గోపీచంద్ తో గత కొంత కాలంగా సక్సెస్ కోసం అల్లాడుతున్నాడు. అయినా కూడా ప్రత్యేకమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న గోపిచంద్ ప్రస్తుతం 'చాణక్య' సినిమా ఫినిషింగ్ లో బిజీగా ఉన్నాడు. దసరా కానుకగా రాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ మీద ఇప్పటికే చాలా అంచనాలు ఉండటమే కాదు గోపి కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా గోపిచంద్ 28వ సినిమాకు రంగం సిద్ధమయ్యిందని తాజా సమాచారం.

సంపత్ నంది దర్శకత్వంలో - యుటర్న్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తీసిన శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుందని ఫ్రెష్ అప్‌డేట్. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలుపెట్టుబోతున్న ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్.. ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ తదితర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. సంపత్ నంది - గోపిచంద్ కాంబినేషన్ లో గతంలో గౌతమ్ నందా వచ్చిన సంగతి తెలిసిందే. పాజిటివ్ తో పాటు నెగటివ్ షేడ్స్ లో గోపీచంద్ డ్యూయల్ రోల్ చేసిన ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోనప్పటికీ కమర్షియల్ గా మాత్రం హిట్ అనే చెప్పాలి.

అప్పుడే సంపత్ మేకింగ్ స్టైల్ నచ్చిన గోపీచంద్ మరో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించాడు. అయితే ఆ ప్రాజెక్ట్ ఇన్నాళ్ళ కు కార్యరూపం దాల్చబోతోంది. మంచి సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందుతుందని హీరో కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ గా నిలుస్తుందని యూనిట్ ధీమాను వ్యక్తం చేస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో రూపొందే ఈ హై బడ్జెట్ మూవీకి దర్శకత్వంతో పాటు కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్.. సంపత్ నంది. ఇక సంపత్ నంది కి కూడా ఈ మధ్య మాంచి కమర్షియల్ సక్సస్ వచ్చి చాలా కాలమే అయింది. అందుకే ఈ సినిమా సంపత్ కి కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇప్పటికే అర్థమైన విషయం.



మరింత సమాచారం తెలుసుకోండి: