మెగా కాంపౌండ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన 'వాల్మీకి' సినిమా కి అడ్డంకులు భయంకరంగా ఇటీవల వచ్చాయి. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న క్రమంలో ఈ సినిమాకి వచ్చిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. హైకోర్టు దాకా ఈ సినిమా వ్యవహారం వెళ్లడంతో సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో వాల్మీకి సినిమా పెద్ద హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా బోయ సామాజికవర్గానికి చెందిన వాల్మీకి పేరుని కించపరిచారని ‘వాల్మీకి’ సినిమా యూనిట్ పై బోయ కులానికి చెందిన ప్రముఖులు సీరియస్ అవ్వడం జరిగింది.


అంతేకాకుండా బోయ కులానికి చెందిన వాళ్లు సినిమా టైటిల్ పై హైకోర్టు దాకా వెళ్లడంతో సమస్య తీవ్రంగా మారటంతో సినిమా యూనిట్ దెబ్బకి వాల్మీకి టైటిల్ ని 'గద్దలకొండ గణేష్'గా మార్చింది. మన కులానికి చెందిన వ్యక్తి పాత్రను సినిమాలో చాలా నెగటివ్ గా చూపించడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన 'వాల్మీకి' కులానికి చెందిన వ్యక్తులు ఆ సామాజిక వర్గానికి చెందిన  బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి రచ్చ రచ్చ చేసింది.


దీంతో చిత్రబృందానికి, వరుణ్ తేజ్ కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో సినిమా పేరు మారుస్తున్నట్లుయూనిట్ కోర్టుకి తెలియజేసింది. 'వాల్మీకి' పేరుని 'గద్దలకొండ గణేష్' గా మారుస్తామని వెల్లడించింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర పేరే 'గద్దలకొండ గణేష్'. ఇంక ఏం చేయాలో అదే పేరును టైటిల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. వరుణ్ తేజ్, పూజా హెగ్డే నటించిన ఈ సినిమాని డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించారు. శుక్రవారం భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: