బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో వారం వారం ఆట మరింత రసవత్తరంగా మారుతుంది. లాస్ట్ వీక్ వితిక ఇంటి కెప్టెన్ కాగా ఈ వారం జరిగిన లెక్చరర్, స్టూడెంట్ టాస్క్ లో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారని బాబా, మహేష్ లను కెప్టెన్ సీ టాస్క్ కు ప్రమోట్ చేశారు. ఇంటి సభ్యులందరికి ఓ  పూలమాల ఇచ్చి తాము ఎవరినైతే కెప్టెన్ గా చేయాలని అనుకుంటున్నారో వారికి ఆ పూల మాల వేయాల్సి ఉంటుంది. 


మహేష్ కు 8 పూలమాలలు రాగా బాబా భాస్కర్ కు రెండు పూలమాలలు మాత్రమే వచ్చాయి. సో టాస్క్ లో విన్ అయిన సందర్భంగా మహేష్ విట్ట ఈ వారం కెప్టెన్ గా గెలిచాడు. ఇంటి సభ్యులందరు కలిసి అతన్ని కెప్టెన్ గా గెలిపించారని చెప్పొచ్చు. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న మహేష్ కెప్టెన్ గా మారడం కొన్ని అనుమానాలకు దారి తీస్తుంది.    


ఈ వారం టెలిఫోన్ టాస్క్ లో మహేష్, రాహుల్ నామినేట్ అవగా కెప్టెన్ అయిన వితికకు స్పెషల్ అధికారం ఇవ్వగా హిమజని నామినేట్ చేసింది. సో ఈ వారం ముచ్చటగా ముగ్గురు నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ లేకుండా వైల్డ్ కార్డ్ గా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులకు ఓటింగ్ జరుపుతారని భావించారు. కాని అలాంటిదేమి జరుగలేదు.


రాహుల్, హిమజలకు బయట మంచి ఫాలోయింగ్ ఉంది. ఎటొచ్చి మహేష్ డేంజర్ జోన్ లో ఉండొచ్చు. అయితే ఈ వారం కెప్టెన్ అయ్యాడు కాబట్టి మహేష్ ఎలిమినేషన్ రద్దవుతుందా అన్న డౌట్ కూడా ఉంది. ఏది ఏమైనా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ గురించి ఆడియెన్స్ లో ఎక్సైట్ మెంట్ మొదలైంది. ఇక గురువారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులను వారికి కలిసే ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. అయితే అందులో కూడా 10 మంది సభ్యుల కుటుంబ సభ్యులకు 10 బాక్సులు ఇచ్చి దానిలో ఎవరికైతే బిగ్ బాస్ ఐ వస్తుందో వారు నెక్స్ట్ లెవల్ కు వెళ్తారని చెప్పాడు. మొత్తానికైతే ప్రస్తుతం ఆట రసవత్తరంగా ఉందని మాత్రం చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: