యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్  "అల్లుడు శీను" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. వి వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ని బెల్లంకొండ సురేష్ నిర్మించారు.సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ  యాక్షన్ ఎంటర్టైనర్ గా  తెరకెక్కింది. కానీ సినిమా ఆశించిన రితీలో విజయం సాధించలేదు. శ్రీనివాస్ చేసిన డ్యాన్సులకు మరియు ఫైట్ లకు మంచి మార్కులు పడ్డాయి  
బెల్లంకొండ శ్రీనివాస్ ఆయన హీరోగా నటించిన సినిమాలు వసుసగా రిలీజ్ అవుతున్నాయి కానీ సినిమాలు విజయం సాధించడం లేదు. రీసెంట్ గా తమిళం లో హిట్ అయిన రాక్షసన్ సినిమాని తెలుగు లో రాక్షసుడు గా రీమేక్ చేశాడు. అనుపమ పరమేశ్వరి హీరోయిన్ నటించిన ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. రాక్షసుడు సినిమా మంచి విజయం సాధించింది. శ్రీనివాస్ నటనకు మంచి పేరు వచ్చింది
ఫైట్ మాస్టర్  పీటర్ హాన్స్ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. బెల్లంకొండ్ శ్రీనివాస్ ని పీటర్ హాన్స్ దర్శకత్వం చేయబోతున్నాడని వార్తలు  వస్తున్నాయి. ఈ సినిమాలో హై యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు మంచి డ్రామా ఉండేలా స్ర్కీప్ట్ ని రెడీ చేస్తున్నారట . ఈ విషయాలపై  అధికారిక ప్రకటన చేయలేదు..
ఫైట్ మాస్టర్ పీటర్ హాన్స్  తెలుగులో మురారి సినిమాతో  ఫైట్ మాస్టర్ గా పరిచయం అయ్యాడు. అపరిచితుడు, శివాజీ, మగధీర సినిమాలు ఆయనకు ఫైట్ మాస్టర్ గా మంచి పేరును తీసుకవచ్చాయి. పీటర్ హాన్స్ బాహుబాలి రెండు సినిమాలకు ఫైట్ మాస్టర్ గా పని చేశాడు. ఈ సినిమాలతో నేషనల్ లెవెల్ లో గుర్తింపు వచ్చింది.ప్రస్తుతం భారీ చిత్రాల దర్శకుడు  శంకర్ మరియు కమల్ హాసన్ కలయికలో వస్తున్న భారతీయుడు 2 సినిమా కి ఫైట్ మాస్టర్ గా   పని చేస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: