స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ గద్దలకొండ గణేష్’ నేడు రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ మొదట వాల్మీకి టైటిల్ తో వచ్చింది. ఈ మూవీ విడుదలకు ముందు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ సినిమా టైటిల్ ను మారుస్తున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ‘వాల్మీకి’ సినిమా పేరును ‘గద్దలకొండ గణేశ్’గా మార్చినట్టు తెలిపారు.  వాస్తవానికి ఈ మూవీ టైటిల్ పై మొదటి నుంచి ఎన్నో విమర్శలు వస్తున్నా..ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం..తీరా నిన్న రిలీజ్ చేసే సమయానికి కోర్టులో కేసులు మరీ తీవ్ర తరం అవుతుందని భావించడం..అలాగే వాల్మీకి మహర్షిపై గౌరవంతో తాను టైటిల్ మార్చుతున్నట్లు డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపారు.

కాగా, ‘వాల్మీకి’ టైటిల్ పై బోయ సామాజికవర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ టైటిల్ తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉందని బోయహక్కుల పోరాటసమితి హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. గద్దల కొండ గణేష్ గా టైటిల్ ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్ అమెరికాలో ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. తమిళ మూవీకి రీమేక్  అయినప్పటికీ ఒరిజినల్ కథలో ఉన్న పాత్ర కంటే విభిన్నంగా వరుణ్ ఎట్రాక్ట్ చేశాడు. ఇక హరీష్ శంకర్ డైరెక్టర్ గా మరోసారి తన మాస్ ఎలిమెంట్స్ ని కరెక్ట్ గా ప్రజెంట్ చేశాడు.

గతంలో పవన్ కళ్యాన్ తో గబ్బర్ సింగ్ ఏ రేంజ్ లో ఊపాడో హరీష్ శంకర్ అదే ఊపు ఈ మూవీలో కనిపించిందంటున్నారు. ప్రతి సీన్ లో తన మార్క్ మేకింగ్ ని చూపించాడు. అయితే కొన్ని సీన్లు పరమ బోరింగ్ ఫీల్ కలిగించాయని కూడా అంటున్నారు.  ఇక పూజా హెగ్డే న్యాచురల్ యాక్టింగ్ తో తన రేంజ్ కి తగ్గట్టు నటించింది. ముఖ్యంగా వెల్లువచ్చి గోదారమ్మా సాంగ్ ఆమె చూపించిన హావభావాలు శ్రీదేవిని మరిపించకపోయినా..గుర్తు చేసిందంటున్నారు.

గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ సరికొత్తగా కనిపించడమే కాదు..డైలాగ్ డెలివరీ కూడా అదిరిపోయిందని అంటున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి మంచి బూస్ట్ ని అందించాయి.  సెకండ్ హాఫ్ డిఫరెంట్ ఎపిసోడ్స్ మూవీకి బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. మొత్తానికి ఈ మూవీ ఎంట్రటైన్ మెంట్ గా చూడొచ్చని అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ మూవీ హిట్టా..ఫట్టా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: